technology

ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు 26 ఐఫోన్ల‌ను తెచ్చిన మ‌హిళ‌.. త‌రువాత ఏమైందంటే..?

హాంకాంగ్ నుంచి భారతదేశానికి 26 ఐఫోన్ 6 ప్రో మాక్స్ పరికరాలని తరలించడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో, ఓ మహిళ ప్రయాణికురాలిని కష్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో 37 లక్షలకు పైగా విలువైన సీజ్ చేసిన ఫోన్లను దాచి, టిష్యూ పేపర్లో చుట్టి ప్రయాణికుల వ్యానిటీ బ్యాగులో దాచి ఉంచారు. ఢిల్లీకి రాగానే మహిళని పట్టుకున్నారు.

ఇంటలిజెన్స్ ఆధారంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ తన వ్యానిటీ బ్యాగ్ లో 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ పెట్టుకుని హాంకాంగ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న మహిళ ప్రయాణికురాలని అడ్డగించారు అని విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు. వేగవంతమైన చర్య స్మగ్లింగ్ కార్యకలాపాలను అధికారులు అరికట్టారు.

woman brought 26 iphone 16 pro max phones to airport

ఆపిల్ నుంచి వచ్చిన ఖరీదైన ఫోన్లలో ఇది ఒకటి. 256 జీబీ మోడల్ భారతదేశంలో రూ. 1,44,900 హాంకాంగ్ ధరకి ఇక్కడికి 34,987 రూపాయలు తేడా వస్తోంది. అదుపులోకి తీసుకున్న ఈ మహిళపై 1962 కస్టమ్స్ చట్టం కింద అభియోగాలు మోపారు. ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు, తదుపరి విచారణ జరుగుతోందని అన్నారు. అలాగే సోమవారం తెల్లవారుజామున సౌదీ డమ్మామ్ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తి నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ బ్యాటరీ ప్రాంతంలో లోపల రెండు బంగారు కడ్డీలను దాచి పెట్టి అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

Peddinti Sravya

Recent Posts