technology

అక్టోబ‌ర్ 1 త‌ర్వాత నుండి మీకు ఓటీపీలు రావు.. ట్రాయ్ నిబంధ‌న‌లు ఏంటంటే..?

స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌బోతుంది. ఇవి లేని పోని స‌మ‌స్య‌లు తెచ్చి పెట్టేలా క‌నిపిస్తున్నాయి.సెప్టెంబర్ 1, 2024 నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రావల్సి ఉన్నా గడువు పొడిగించాలని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో సంస్థలు ట్రాయ్‌ని కోరాయి. దాంతో అక్టోబ‌ర్ 1 నుండి అమ‌లులోకి తీసుకు వ‌స్తున్నారు. అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, ఇ-కామర్స్ కంపెనీల నుంచి వచ్చే మొబైల్ ఓటీపీలు ఇంతకు ముందులాగా అందకపోవచ్చు. దీనివల్ల చాలా పనులు ఆగిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

టెలికాం రెగ్యులేటర్ సంస్థ సూచ‌న ప్ర‌కారం కంపెనీలు ఈ మార్పుకు సిద్ధం కాలేకపోవడంతో ఆ తేదీని అక్టోబర్‌కు వాయిదా వేశారు. ఇప్పుడా తేదీ సమీపించింది. సాధారణంగా బ్యాంకు పనులు చేయాలంటే ఓటీపీ అనేది అవసరం. అది రాకపోతే పనులు ఆగిపోతాయి. ఆన్‌లైన్‌లో ఏదైనా కొన్నప్పుడు కూడా అవసరం. అది రాకపోతే వస్తువులు డెలివరీ కావు. అయితే వైట్‌లిస్ట్‌ కాని కంపెనీల ఎస్ఎంఎస్ మెసేజ్‌ల్లో వెబ్‌సైట్ లింక్స్‌, ఓటీటీ లింక్స్‌, ఏపీకేలు ఉంటే వాటిని బ్లాక్ చేయాలని టెలికాం అథారిటీ టెలికాం కంపెనీలకు తెలిపింది. తెలియని లింక్స్‌పై క్లిక్ చేస్తే ఫోన్‌లోకి వైరస్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కొత్త నియమం వల్ల అలాంటి ప్రమాదం తగ్గుతుంది.ఈ రూల్ ప్రకారం, వైట్‌లిస్ట్‌ కాని మెసేజ్‌లలో వచ్చే వెబ్‌సైట్ లింక్స్, యాప్‌ లింక్స్ వంటివి బ్లాక్ అవుతాయి.

after october 1st you will not receive otps

కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక మొబైల్ యూజర్లకు వచ్చే ప్రతి మెసేజ్ ఒక నిర్దిష్ట ఫార్మాట్‌లో ఉండాలి. అంటే, బ్యాంకు మెసేజ్ ఎలా ఉండాలో, ఫుడ్ డెలివరీ యాప్ మెసేజ్ ఎలా ఉండాలో అన్నది ముందే నిర్ణయించడం జరుగుతుంది. ఈ నిర్ణయించిన ఫార్మాట్‌లో లేని మెసేజ్‌లు యూజర్ల ఫోన్‌కు రావు.మెసేజ్‌లో వెబ్‌సైట్ లింకులు, ఫోన్ నంబర్లు వంటివి ఉంటే అవి కూడా ముందే అనుమతి పొందినవి అయి ఉండాలి. లేకుంటే మెసేజ్ బ్లాక్ అవుతుంది. ప్రతి మెసేజ్‌ను ఒక స్మార్ట్ సిస్టమ్ చెక్ చేస్తుంది. అది మంచి మెసేజా లేదా చెడు మెసేజా అని తెలుసుకుని, చెడు మెసేజ్‌లను ఫోన్‌కు రాకుండా బ్లాక్ చేస్తుంది. మ‌రి ట్రాయ్ ఇప్ప‌టికే చాలా గ‌డువు ఇచ్చింది కాబ‌ట్టి ఇప్పుడు ఈ డేట్‌ని తిరిగి పొడిగించే అవ‌కాశం లేదనిపిస్తుంది.

Sam

Recent Posts