vastu

Signature : ఇన్నాళ్లుగా మీరు చేస్తున్న సంత‌కం త‌ప్పు అని మీకు తెలుసా..? వాస్తు ప్ర‌కారం సంత‌కం ఇలా పెడితే.. డబ్బుకు లోటు ఉండ‌దు..!

Signature : ఆర్థిక స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే చాలా మందికి ఉంటాయి. కొంద‌రికి డ‌బ్బు అస‌లు చేతిలో నిల‌వ‌దు. ఎంత సంపాదించినా డ‌బ్బు ఏదో ఒక రూపంలో ఖ‌ర్చు అవుతూనే ఉంటుంది. ఇక కొంద‌రికి అస‌లు సంప‌ద క‌ల‌గ‌దు. ఎప్ప‌టికీ స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతుంటారు. అలాంటి వారు వాస్తు ప‌రంగా కొన్ని సూచ‌న‌లు పాటిస్తే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా చేసే సంత‌కంలో వాస్తు ప‌రంగా మార్పులు చేసుకోవాలి.

చాలా మంది త‌మ సిగ్నేచ‌ర్ల‌ను భిన్న ర‌కాలుగా పెడుతుంటారు. ఇక కొంద‌రు సంత‌కం కింద లైన్ గీస్తారు. కొంద‌రు చుక్క‌లు పెడ‌తారు. అయితే వాస్తు ప్ర‌కారం సంత‌కం కింద లైన్ గీసి దాని కింద రెండు చుక్క‌లు పెట్టాలి. ఈ విధంగా సంత‌కం పెట్ట‌డం ప్రాక్టీస్ చేయాలి. అలాగే సంత‌కంలో ఈ విధంగా మార్పులు చేసుకోవాలి.

you have to do sign like this according to vastu

ఈ విధంగా సంత‌కాన్ని పెట్ట‌డం వ‌ల్ల వాస్తు దోషం పోతుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. డ‌బ్బు సంపాదించ‌ని వారు డ‌బ్బును సంపాదించ‌డం మొద‌లు పెడ‌తారు. డ‌బ్బు చేతిలో నిల‌వ‌ని వారికి డ‌బ్బు ఆదా అవుతుంది. ఇలా డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు. ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

Admin

Recent Posts