పోష‌ణ‌

దీన్ని మీరు చూసే ఉంటారు.. దీని పేరు ఏమిటో, దీన్ని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

రామ్ కంద.. రామ కందమూలం.. భూచక్ర గడ్డ.. అని దీన్ని వివిధ ర‌కాల పేర్లతో పిలుస్తారు. చిత్రంలో కనబడుతున్న ఒక పెద్ద దుంగలాంటి చెట్టు కాండాన్ని రామ్ కంద అంటారు. దీన్ని చిరుతిండిగా చాలా ప్రాంతాలలో అమ్ముతారు. ఈ దుంగ మొత్తం కొబ్బరి మొవ్వలా మెత్తగా వుంటుంది. రుచిగా, తియ్యగా కూడా వుంటుంది. రామ్ కంద దుంగను పలుచని పొరలుగా, ముక్కలు కోసి అమ్ముతారు. ఇలా ఒక్కొక్క దుంగ నుండి కొన్ని వేల ముక్కలు కోస్తారు. దీన్ని కంద అని పిలుస్తారు గాని నిజానికి ఇది చెట్టు కాండమే. మన దేశపు అడవుల్లో ఇవి విరివిగా దొరుకుతాయి. తెలుగు ప్రాంతాల్లో వీటిని భూచక్ర గడ్డ, రామ కందమూలం అంటారు. ఇది ఒక అరుదైన దుంప. కొండల మధ్య దొరికే ఈ దుంపకు విపరీతమైన డిమాండ్ ఉంది.

పెద్ద పరిమాణంలో ఉండే ఈ దుంప భూమిలో 10-15 మీటర్ల లోతులో పెరుగుతుంది. ఈ దుంప బెరడు లేతవర్ణంలో ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. ఎత్తైన కొండల్లో భూమి లోపల నుంచి సేకరించినది కాబట్టి ఎలాంటి రసాయనలు వాడరు. ఈ భూచక్ర గడ్డ ఆకు, పువ్వు, కాండం తీపి రుచిని కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి రక్తం శుద్ధి అవుతుంది.

do you know what is this bhoo chakra gadda

ఈ దుంపలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది కాకుండా ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు సందర్భాలలో కూడా తినవచ్చు. బరువు తగ్గడంలో భూచక్ర గడ్డ సహాయపడుతుంది. ఈ దుంపలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా సేపు పొట్ట నిండుగా ఉంటుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫైబర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును సులభంగా జీర్ణం చేస్తుంది. త్వరగా బరువును తగ్గిస్తుంది.

Admin

Recent Posts