Asthma Foods : ఆస్తమా ఉన్నవారు.. వీటిని రోజూ తీసుకుంటే.. ఎంతో ఉపశమనం లభిస్తుంది.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి..!

Asthma Foods : ఆస్తమా సమస్య ఉన్నవారు రోజూ తీసుకునే ఆహారాల విషయంలో కచ్చితంగా జాగ్రత్తలను పాటించాలి. కొన్ని రకాల ఆహారాలు ఆస్తమాను పెంచుతాయి. కొన్ని ఆస్తమాను తగ్గిస్తాయి. అసలే ఇది చలికాలం కనుక ఆస్తమా పేషెంట్లకు సహజంగానే ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే వారు రోజువారీగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే దాంతో ఆస్తమా ద్వారా తలెత్తే ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు.

Asthma Foods you must take daily to get relief from it

ఆస్తమా ఉన్నవారు తాజా పండ్లతోపాటు పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో సమస్య తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చు. ఇక విటమిన్‌ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటున్నా ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపలు, పాలు, నారింజ పండ్ల రసం, కోడిగుడ్లను రోజూ తీసుకోవాలి. ఇవి ఆస్తమా నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.

విటమిన్‌ ఎ ఎక్కువగా ఉండే క్యారెట్లు, తర్బూజా, చిలగడ దుంపలు, యాపిల్‌ పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, పాలకూర, బ్రొకొలి వంటి వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటి వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.

అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు పొటాషియం అధికంగా ఉంటుంది. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి. కానీ రోజూ ఒక అరటి పండును తింటుంటే ఆస్తమా ఉన్న వారికి మేలు జరుగుతుంది.

ఇక మెగ్నిషియం అధికంగా ఉండే పాలకూర, గుమ్మడికాయ విత్తనాలు, డార్క్‌ చాకొలెట్, చేపలను ఆహారంలో తీసుకుంటున్నా.. ఆస్తమా నుంచి బయట పడవచ్చు. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

ఆస్తమా సమస్య ఉన్నవారు తీసుకోకూడని ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. వైన్‌, బీన్స్‌, క్యాబేజీ, ఉల్లిపాయలు, కూల్‌ డ్రింక్స్‌, చల్లగా ఉండేవి, కెమికల్స్‌ వాడిన పానీయాలు, నిల్వ చేయబడిన ఆహారాలను అస్సలు తీసుకోరాదు. లేదంటే ఆస్తమా మరింత ఎక్కువవుతుంది.

Editor

Recent Posts