Gym : రోజూ 30 నిమిషాలు జిమ్‌లో వ్యాయామాలు చేస్తే చాలట.. అనేక వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చంటున్న నిపుణులు..

Gym : ప్రస్తుత తరుణంలో సగటు మనిషి జీవితం ఉరుకుల పరుగులతో బిజీగా మారింది. ఈ క్రమంలోనే రోజూ టైముకు నిద్ర లేవడం లేదు. టైముకు పడుకోవడం లేదు. ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు. ఒత్తిడి, ఆందోళనలతో కాలం గడుపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే యాంత్రిక జీవనంలా మారిపోయింది. దీంతో సమయానికి భోజనం చేయక, రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయకపోవడంతో.. అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి. దీంతో ప్రాణాల మీదకు వస్తోంది.

doing Gym exercises daily about 30 minutes can prevent many diseases say experts

అయితే రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే జిమ్‌లో వ్యాయామం చేస్తే అనేక వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. జిమ్‌లో వ్యాయామం చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయని అంటున్నారు.

మీకున్న సమస్యలను బట్టి జిమ్‌లో ట్రెయినర్‌కు చెబితే అందుకు తగినట్లుగా ముందుగానే వ్యాయామ ప్రణాళికను ఇస్తారు. మీకు సౌకర్యవంతంగా ఉండే వ్యాయామాలను చేయిస్తారు. దీంతో రోజూ తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేసే అవకాశం లభిస్తుంది. కేవలం 30 నిమిషాల పాటు జిమ్‌లో వ్యాయామం చేయడం వల్ల కనీసం ఎంత లేదన్నా 500 క్యాలరీలను ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే విషయమని చెబుతున్నారు.

రోజూ కనీసం 30 నిమిషాల పాటు జిమ్‌లో వ్యాయామం చేస్తే.. అధిక బరువు తగ్గుతారు. సకల సమస్యలకు మూలకారణం అధిక బరువు కనుక బరువు తగ్గాక.. ఇతర అనారోగ్యాల నుంచి కూడా నెమ్మదిగా బయట పడవచ్చు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్‌ రాకుండా జాగ్రత్త పడవచ్చు. షుగర్‌ ఉన్నవారికి షుగర్‌ లెవల్స్‌ అదుపులోకి వస్తాయి.

జిమ్ లో రోజూ కనీస సమయం పాటు వ్యాయామం చేసినా చాలు.. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది. ఇది గుండె జబ్బులు, హార్ట్‌ ఎటాక్ లు రాకుండా చూస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిపోతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

జిమ్‌లో వ్యాయామం చేయడం వల్ల నిత్యం ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఉత్సాహంగా ఉంటారు. ఎంత పని చేసినా అలసిపోరు.

అయితే జిమ్‌లో వ్యాయామం చేస్తే మంచిదే. కానీ డాక్టర్‌ సలహా మేరకు ఎవరికి ఎంత అవసరమో అన్ని నిమిషాల పాటు మాత్రమే వ్యాయామం చేయాలి. మోతాదుకు మించిన సమయం పాటు వ్యాయామం చేస్తే దుష్పరిణామాలు కలుగుతాయి. కనుక కనీసం 30 నిమిషాల పాటు అయినా జిమ్‌లో వ్యాయామం చేసే ఏర్పాటు చేసుకోవాలి. దీంతో అనేక వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు.

Admin

Recent Posts