Albakara Fruit : ఈ పండ్లు ఎక్క‌డ క‌నిపించినా వెంట‌నే ఇంటికి తెచ్చుకోండి.. అస‌లు విడిచిపెట్టొద్దు..

Albakara Fruit : మ‌న‌కు తినేందుకు అందుబాటులో అనేక ర‌కాల పండ్లు ఉన్నాయి. వాటిల్లో ఆల్బుక‌రా పండ్లు ఒక‌టి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆక‌ర్షణీయంగా ఉంటాయి. కొన్ని ర‌కాల ఆల్బుక‌రా పండ్లు ఊదా రంగులో కూడా ఉంటాయి. అయితే ఎరుపు రంగులో ఉండే పండ్లే మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. వీటిని దాదాపుగా అన్ని సీజ‌న్ల‌లోనూ విక్ర‌యిస్తుంటారు. మ‌న‌కు ఇవి డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. ఆల్బుక‌రా పండ్ల‌ను జామ్‌ల‌ను త‌యారు చేసేందుకు కూడా ఉప‌యోగిస్తారు. వీటిలో సుమారుగా 2000కు పైగా వెరైటీలు ఉన్నాయి. ఆల్బుక‌రా పండ్ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఆల్బుక‌రా పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది.

ఆల్బుక‌రా పండ్ల‌లో క్రోమియం, పొటాషియం, సెలీనియం వంటి మిన‌ర‌ల్స్ తోపాటు విట‌మిన్ సి, బీటా కెరోటీన్ కూడా అధిక మొత్తాల్లో ఉంటాయి. ఈ పండ్ల‌లో విట‌మిన్ ఎ, ఫోలేట్‌, విట‌మిన్ కె, విట‌మిన్ బి1, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్‌, కాల్షియం, ఫ్లోరైడ్‌, పొటాషియం వంటి అనేక పోష‌కాలు ఉంటాయి. అలాగే ఫైబ‌ర్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి, షుగ‌ర్ ఉన్న‌వారికి ఈ పండ్లు ఉత్త‌మ‌మైన ఆహారం అని చెప్ప‌వచ్చు. ఈ పండ్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల శరీరంలోని కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది. స‌న్న‌గా, నాజూగ్గా మారుతారు. ఆల్బుక‌రా పండ్ల‌లో ఉండే ఫైబర్ జీర్ణ స‌మస్య‌ల‌ను కూడా త‌గ్గిస్తుంది. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు. రోజూ ఉద‌యాన్నే సాఫీగా విరేచ‌నం అవుతుంది. అలాగే జీర్ణ‌వ్య‌వ‌స్థ మొత్తం శుభ్ర‌మ‌వుతుంది. ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

Albakara Fruit benefits in telugu take daily for maximum effect
Albakara Fruit

ఈ పండ్ల‌లో విట‌మిన్ సి, బీటా కెరోటీన్ అధికంగా ఉంటాయి. క‌నుక ఈ పండ్ల‌ను తింటే కంటి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ఈ పండ్ల‌లో ఉండే కెరోటినాయిడ్లు, లుటీన్‌, జియాజంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి పొర‌ల‌ను ర‌క్షిస్తాయి. దీంతో క‌ళ్ల‌లో శుక్లాలు రావు. అలాగే సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని గంట‌ల త‌ర‌బ‌డి పని చేసే వారు ఆల్బుక‌రా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. కంటి చూపు మెరుగు ప‌డుతుంది. ఈ పండ్లు గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ర‌క్త‌నాళాల్లో ర‌క్త స‌ర‌ఫ‌రా సాఫీగా సాగేలా చేస్తాయి. దీంతో కార్డియాక్ అరెస్ట్‌, స్ట్రోక్‌, హార్ట్ ఎటాక్ వంటివి రావు. గుండె ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.

ఆల్బుక‌రా పండ్లలో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. దీని వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు, వాపులు రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే ఈ పండ్లను తింటే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ కె, పొటాషియం శ‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హించేలా చేస్తాయి. దీని వ‌ల్ల ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది. ర‌క్తం శుద్ధి అవుతుంది. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎల‌క్ట్రోలైట్స్ స‌మ‌తుల్యం అవుతాయి. డీహైడ్రేషన్ బారిన ప‌డిన‌ప్పుడు ఆల్బుక‌రా పండ్ల‌ను తింటే త్వ‌ర‌గా కోలుకుంటారు. అలాగే క‌ణాలు, క‌ణ‌జాలం సుర‌క్షితంగా ఉంటాయి.

ఆల్బుక‌రా పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల శ‌రీరానికి క‌లిగే హాని నుంచి మ‌న‌ల్ని రక్షిస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశనం చేస్తాయి. ఆల్బుక‌రా పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి, ఇత‌ర యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మం కాంతివంతంగా, య‌వ్వనంగా మారి మెరిసేలా చేస్తాయి. అలాగే చ‌ర్మంపై ఉండే గీత‌లు, మ‌చ్చ‌లు, మొటిమ‌లు, ముడ‌త‌లు ఉండ‌వు. క‌నుక ఇన్ని లాభాలు ఉన్న ఆల్బుక‌రా పండ్ల‌ను తిన‌డం మరిచిపోకండి. ఇవి ఎక్క‌డ క‌నిపించినా స‌రే వెంట‌నే కొని తెచ్చి తినండి. పైన చెప్పిన లాభాలు అన్నీ క‌లుగుతాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Editor

Recent Posts