Jeedipappu Laddu Recipe : జీడిప‌ప్పు ల‌డ్డూల‌ను ఎప్పుడైనా తిన్నారా.. 10 నిమిషాల్లో ఇలా చేయ‌వ‌చ్చు..

Jeedipappu Laddu Recipe : జీడిప‌ప్పు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. దీన్ని చాలా మంది రోజూ తింటుంటారు. జీడిప‌ప్పును తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. జీడిప‌ప్పులో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ గుప్పెడు జీడిప‌ప్పును తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. అయితే చాలా మంది జీడిప‌ప్పును ప‌లు ర‌కాల వంటల్లో వేస్తుంటారు. దీంతో ఆయా వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే జీడిప‌ప్పును వేసి నేరుగా కూడా వంట‌ల‌ను చేయ‌వ‌చ్చు. వాటిల్లో జీడిప‌ప్పు ల‌డ్డూ ఒక‌టి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా సుల‌భమే. జీడిప‌ప్పు ల‌డ్డూల‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జీడిప‌ప్పు ల‌డ్డూల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీడిప‌ప్పు – ఒక క‌ప్పు, బాదం ప‌ప్పు – అర క‌ప్పు, కొబ్బ‌రి తురుము – ఒక క‌ప్పు, బెల్లం త‌రుగు – ఒక క‌ప్పు, నెయ్యి – పావు క‌ప్పు, కిస్మిస్ – రెండు టేబుల్ స్పూన్లు, జీడిప‌ప్పు ప‌లుకులు – కొన్ని, యాల‌కుల పొడి – అర టీస్పూన్‌.

Jeedipappu Laddu Recipe in telugu make in very quick time
Jeedipappu Laddu Recipe

జీడిప‌ప్పు ల‌డ్డూల‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా స్ట‌వ్ మీద క‌డాయి పెట్టి జీడిప‌ప్పు, బాదంప‌ప్పుని 5 నిమిషాల పాటు దోర‌గా వేయించుకుని తీసుకోవాలి. ఆ త‌రువాత కొబ్బ‌రి తురుమును కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు జీడిప‌ప్పు, బాదంప‌ప్పు, కొబ్బ‌రి తురుము, బెల్లం త‌రుగు మిక్సీలో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. స్ట‌వ్ మీద మ‌ళ్లీ క‌డాయి పెట్టి నెయ్యి వేసి జీడిప‌ప్పు, కిస్మిస్ ప‌లుకుల్ని వేయించుకుని యాల‌కుల పొడి వేసి స్ట‌వ్‌ని ఆఫ్ చేయాలి. ఇందులో ముందుగా చేసుకున్న జీడిపప్పు మిశ్ర‌మం వేసి బాగా క‌లుపుకుని చేతికి నెయ్యి రాసుకుని ల‌డ్డూల‌లా చుట్టుకోవాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన జీడిప‌ప్పు ల‌డ్డూలు రెడీ అవుతాయి. ఇవి అందరికీ న‌చ్చుతాయి. రోజుకు ఒక ల‌డ్డూను తింటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Editor

Recent Posts