Black Grapes : న‌ల్ల ద్రాక్ష‌లు.. మ‌న‌కు ల‌భించిన వ‌రం.. ఎలాగో తెలుసా..?

Black Grapes : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో ద్రాక్ష‌లు ఒక‌టి. వీటిల్లో మూడు ర‌కాలు ఉంటాయి. ఆకుప‌చ్చ‌, ఎరుపు, న‌లుపు.. అని మూడు ర‌కాల ద్రాక్ష‌లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మూడింటిలోనూ న‌ల్ల‌ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్లే మ‌న‌కు అధికంగా లాభాలు క‌లుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. న‌ల్ల ద్రాక్ష‌ల్లో మిగిలిన రెండు ద్రాక్ష‌ల క‌న్నా అధిక మొత్తాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మ‌న‌కు క‌లిగే అనేక వ్యాధుల‌ను న‌యం చేస్తాయి. క‌నుక న‌ల్ల ద్రాక్ష‌ల‌ను రోజూ తినాలి.

Black Grapes are wonderful fruits for us say experts
Black Grapes

న‌ల్ల ద్రాక్ష‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులను త‌గ్గించ‌గ‌ల‌వ‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్లడైంది. ముఖ్యంగా క్యాన్స‌ర్‌, డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. న‌ల్ల ద్రాక్ష‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మ‌న శ‌రీరంలోని క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. దీని వ‌ల్ల ఆయా వ్యాధులు రాకుండా ఉంటాయి. అందువ‌ల్ల న‌ల్ల ద్రాక్ష‌ల‌ను రోజూ ఒక క‌ప్పు మోతాదులో అయినా స‌రే తినాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక న‌ల్ల ద్రాక్ష‌ల్లో ఉండే పోష‌కాలు శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను తగ్గిస్తాయి. దీంతోపాటు ర‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకుల‌ను తొల‌గిస్తాయి. అందువ‌ల్ల హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. న‌ల్ల ద్రాక్ష‌ల్లో ఉండే రెస్వెరెట్రాల్ అనే స‌మ్మేళ‌నం ర‌క్త నాళాల్లో ర‌క్తం సుల‌భంగా స‌ర‌ఫ‌రా అయ్యేలా చేస్తుంది. దీంతో బీపీ త‌గ్గుతుంది. అలాగే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. దీంతోపాటు డ‌యాబెటిస్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది. అలాగే ఈ ద్రాక్ష‌ల్లో ఉండే ఫైటో కెమిక‌ల్స్ గుండె కండ‌రాల‌కు జ‌రిగే న‌ష్టాన్ని నివారిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఇక ఈ ద్రాక్ష‌ల్లో విట‌మిన్ ఎ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. మెద‌డును యాక్టివ్‌గా ఉంచుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. ద్రాక్ష‌ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతార‌ని సైంటిస్టులు చేసిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. అలాగే న‌ల్ల‌ ద్రాక్ష‌ల్లో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధుల నుంచి త్వ‌ర‌గా కోలుకునేలా చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక న‌ల్ల ద్రాక్ష‌ల‌ను రోజూ ఒక క‌ప్పు మోతాదులో త‌ప్ప‌కుండా తినాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Editor

Recent Posts