Mixed Vegetable Rice : అన్ని కూర‌గాయ‌ల‌తో మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్‌.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం కూడా..

Mixed Vegetable Rice : సాధార‌ణంగా మ‌నం త‌ర‌చూ అన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌ను తింటుంటాం. అయితే ఉద‌యం వంట ఏదో ఒక‌టి చేసేయాలి. ఆఫీస్ ల‌కు, కాలేజీలు, స్కూళ్ల‌కు వెళ్లేవారి కోసం బాక్స్ రెడీ చేయాలి. కానీ వంట చేసేందుకు కొంద‌రికి ఒక్కోసారి స‌మ‌యం ఉండ‌దు. లేదా ఏం కూర చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఎక్కువ సేపు ఆలోచించ‌కుండా వెంట‌నే మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్ చేయండి. వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను క‌లిపి చేసే రైస్ ఇది. దీన్ని చేస్తే కూర చేయాల్సిన ప‌ని ఉండ‌దు. దీన్ని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లేదా మ‌ధ్యాహ్నం లంచ్‌లో తిన‌వ‌చ్చు. ఇక దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్ త‌యారీకి కావాల్సిన పదార్థాలు..

బియ్యం – 2 క‌ప్పులు, నీళ్లు – స‌రిప‌డా, త‌రిగిన బీన్స్ – 20 గ్రాములు, క్యారెట్ ముక్క‌లు – 40 గ్రాములు, ఆలుగ‌డ్డ ముక్క‌లు – 50 గ్రాములు, ప‌చ్చి బ‌ఠాణీలు – 60 గ్రాములు, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 40 గ్రాములు, సాజీరా – 1 టీస్పూన్‌, దాల్చిన చెక్క, ల‌వంగాలు, ప‌సుపు – కొద్దిగా, వెల్లుల్లి, అల్లం పేస్ట్ – కొద్దిగా, ఉప్పు – రుచికి స‌రిప‌డా, నూనె -2 టేబుల్ స్పూన్లు, జీడిప‌ప్పు, కిస్‌మిస్‌లు – 10 చొప్పున‌.

Mixed Vegetable Rice very easy to make and healthy
Mixed Vegetable Rice

మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో నూనె వేయాలి. నూనె కాగాక జీడిపప్పు, కిస్ మిస్ లను గోల్డెన్ కలర్ లో వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత లవంగాలు రెండు, దాల్చిన చెక్క, సాజీర వేయాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి. ఆ తరువాత ఉల్లిపాయ‌లు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి సగం పైగా వేగాక ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేయాలి.

చిన్న మంటపై వీటిని మగ్గించుకోవాలి. ఇవి నూనెలో మగ్గిన తరువాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకటికి రెండు కప్పుల నీళ్ళు పోయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెజ‌ర్ తగ్గిన తరువాత మూత తీ ముందుగా వేయించుకున్న జీడి పప్పు, కిస్ మిస్ లతో గార్నిష్ చేసికోవాలి. అంతే మిక్స్‌డ్‌ వెజిటబుల్ రైస్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. వంట చేసేందుకు స‌మ‌యం లేక‌పోతే దీన్ని చాలా సుల‌భంగా త్వ‌ర‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts