మీ గుండెను ఆరోగ్యంగా ఉంచాలనుకుంటున్నారా ? అయితే ఈ పండ్లను రోజూ తినండి..!

గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. నేటి వేగవంతమైన ప్రపంచంలో మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా ఆవశ్యకం అయింది. నేటి తరుణంలో చాలా మంది పాటిస్తున్న జీవనశైలి కారణంగానే ఎక్కువగా వారికి గుండె జబ్బులు వస్తున్నాయి. చిన్న వయస్సులోనే హార్ట్‌ ఎటాక్‌ల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే కింద తెలిపిన పండ్లను రోజూ తింటుంటే దాంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి ఆ పండ్లు ఏమిటంటే..

eat these fruits daily to give health to heart

పుచ్చకాయను మన గుండెకు మేలు చేసే పండుగా భావిస్తారు. ఒక అధ్యయనం ప్రకారం.. ఈ పండు హానికరమైన కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. పుచ్చకాయ చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తిని సగానికి సగం తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

ఆరెంజ్ అనేది పుల్లని పండు. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఈ పండు మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతోపాటు ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. కనుక ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ నారింజ పండ్లను తింటే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

నేరేడు పండ్లు కేవలం ఈ సీజన్‌లోనే లభిస్తాయి. ఇతర సీజన్లలో మనకు ప్యాక్‌ చేయబడిన నేరేడు పండ్ల జ్యూస్‌ లభిస్తుంది. దాన్ని తాగవచ్చు. ఈ పండ్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి.  వీటిలో విటమిన్‌ సి, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ చేరకుండా ఉంటుంది. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

ద్రాక్ష పండ్లలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నివారించడానికి చక్కగా పనిచేస్తాయి. అందువల్ల ఈ పండ్లను రోజూ తినాలి. ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ 2.5 గ్రాముల ఫైబర్ తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Share
Admin

Recent Posts