మీకు విటమిన్ డి లోపం ఉంటే మీ నాలుక ఎలా తెలియజేస్తుంది ? తెలుసుకోండి..!

మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అనేక పోషకాలలో విటమిన్ డి ఒకటి. ఇది కొవ్వులో కరిగే పోషకం. చర్మం సూర్యకాంతికి గురైనప్పుడు శరీరం విటమిన్‌ డిని ఉత్పత్తి చేస్తుంది. మన ఎముకలు, దంతాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఈ పోషక లోపం శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది.

this is how your tongue shows about vitamin d deficiency

ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. సాధారణంగా విటమిన్ డి లోపాన్ని రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తారు. అయితే నాలుక పరీక్షను పరీక్షించడం ద్వారా కూడా విటమిన్‌ డి లోపం ఉందో, లేదో సులభంగా గుర్తించవచ్చు. అందుకు ఏం చేయాలంటే..

2017 లో డెర్మటాలజీ, మాయో క్లినిక్, రోచెస్టర్ (USA) ద్వారా నిర్వహించిన పరిశోధన ప్రకారం.. బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ (BMS) లక్షణాలు ఉన్న వ్యక్తులు రక్తంలో గ్లూకోజ్, విటమిన్ D (D2, D3) స్థాయిలను చెక్ చేసుకోవాలి. విటమిన్ B6, జింక్, విటమిన్ B1, TSH స్థాయిలను కూడా పరీక్ష చేసుకోవాలి.

విటమిన్‌ డి లోపం ఉంటే పెదవులు లేదా నాలుకపై మండినట్లు అనిపిస్తుంది. బర్నింగ్‌ సెన్సేషన్‌ అని దీన్ని పిలుస్తారు. ఇక నోటిలో తిమ్మిరిగా, పొడిగా ఉన్నా, దుర్వాసన వస్తున్నా.. దాన్ని విటమిన్‌ డి లోపం అని గుర్తించాలి. ఏదైనా తినేటప్పుడు నొప్పి పెరుగుతుంది. అయితే ఈ లక్షణాలు అందరిలోనూ ఉండకపోవచ్చు.

ఈ మహమ్మారి సమయంలో విటమిన్‌ డి లెవల్స్‌ను ఎక్కువగా కలిగి ఉండాలి. విటమిన్‌ డి రోగ నిరోధకశక్తి పెరిగేందుకు సహాయ పడుతుంది. కనుక విటమిన్‌ డి లెవల్స్‌ తగ్గకుండా చూసుకోవాలి.  ఇక ఈ విటమిన్‌ లోపం ఉంటే అలసట, ఎముకల నొప్పి, కండరాల తిమ్మిరి, నొప్పి, డిప్రెషన్‌ వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.

మనకు విటమిన్‌ డి రోజూ 600 IU మోతాదులో అవసరం అవుతుంది. అదే 70 ఏళ్లు పైబడిన వారికి అయితే రోజూ 800 IU విటమిన్‌ డి కావాలి. విటమిన్‌ డి తక్కువ ఉందని పరీక్షల ద్వారా నిర్దారణ అయితే వైద్యులు విటమిన్‌ డి ట్యాబ్లెట్లను ఇస్తారు. వాటితో ఈ విటమిన్‌ లోపాన్ని అధిగమించవచ్చు.

అలాగే ప్రతిరోజూ ఎండలో కొంత సమయం గడపడం ద్వారా మీ శరీరం తగినంత విటమిన్ డిని తయారు చేస్తుంది. 10 నుండి 20 నిమిషాలు ఎండలో గడపడం వల్ల విటమిన్‌ డి తయారవుతుంది.  పాలకూర, కాలీఫ్లవర్‌, బెండకాయలు, సోయాబీన్‌, చేపలు, పాలు, పుట్ట గొడుగుల్లో విటమిన్‌ డి లభిస్తుంది. వీటిని రోజూ తీసుకుంటే విటమిన్‌ డి లోపం ఏర్పడకుండా చూసుకోవచ్చు.

Admin

Recent Posts