Jamun Fruit : మనకు కాలానుణంగా రకరకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. ఇలా లభించే పండ్లల్లో నేరేడు పండ్లు కూడా ఒకటి. వీటిని అల్ల నేరేడు పండ్లు అని కూడా పిలుస్తారు. నేరేడు పండ్లను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పొరపాటున కడుపులోకి పోయిన వెంట్రుకలను, లోహపు ముక్కలను కరిగించే శక్తి కూడా నేరేడు పండ్లకు ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఈ పండ్లల్లో శరీరానికి అవసరమైన పోషకాలతోపాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి.
ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులకు నేరేడు పండు దివ్య ఔషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లను తినడం వల్ల వీటిలో ఉండే ఆల్కలాయిడ్స్ రక్తంలో చక్కెర ఎక్కువగా పేరుకు పోకుండా చేస్తాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. గుండె జబ్బులు, జీర్ణాశయ సంబంధిత సమస్యలను, ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి సమస్యలను నయం చేయడంలో నేరేడు పండ్లు ఎంతో సహాయపడతాయి.
కాలేయ సంబంధిత సమస్యలను తగ్గించడంలోనూ నేరేడు పండ్లు ఉపయోగపడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్, బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో నేరేడు పండ్లు ఎంతో సహాయపడతాయి. నేరేడు పండ్లను తినడం వల్ల రక్తం శుద్ది అవుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది.
నేరేడు చెట్టు బెరడు కషాయానికి ఇన్ ఫెక్షన్ లను తగ్గించే గుణం ఉంటుంది. నోటి సంబంధిత సమస్యలను తగ్గించడంలో నేరేడు చెట్టు ఆకుల రసం ఎంతో ఉపయోగపడుతుంది. నేరేడు పండ్లు లభించినప్పుడు వీలైనన్ని సార్లు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.