Mulberry : వేసవి కాలం రానే వచ్చింది. ఎండ నుండి మనల్ని మనం కాపాడుకోవడం చాలా అవసరం. ఎండ వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల శరీరం శరీరం నీటితో పాటు పోషకాలను కూడా కోల్పోతుంది. కనుక శరీరానికి నీటిని మరియు పోషకాలను అందించాలి. నీటిని తాగడంతో పాటు కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అలాగే ఎండ వల్ల శరీరం కోల్పోయిన పోషకాలు కూడా అందుతాయి. వేసవికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన పండల్లో మల్ బెర్రీ కూడా ఒకటి. మామిడికాయ, పుచ్చకాయ, కర్బూజతో పాటు ఈ వేసవికాలంలో మనం మల్ బెర్రీని కూడా తీసుకోవాలి. మల్ బెర్రీలు మనకు నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తూ ఉంటాయి. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి.
వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. జామ్ మరియు సిరప్ ల తయారీలో అలాగే సౌందర్య సాధనాల తయారీలో వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. మల్ బెర్రీలు మన ఆరోగ్యానికి అలాగే సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మల్ బెర్రీలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయంలోని మలినాలను తొలగించి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో మల్ బెర్రీలు మనకు ఎంతో సహాయపడతాయి. మల్ బెర్రీలను తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఈ పండ్లు మనకు సహాయపడతాయి. మల్ బెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. దీనిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో సమాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే సమస్యల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఈ పండ్లను తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా మల్ బెర్రీ మనకు ఎంతో దోహదపడుతుంది.
చర్మాన్ని మృదువుగా మార్చడంలో, చర్మం పై మచ్చలను తగ్గించడంలో, చర్మం పై ముడతలను, గీతలను తగ్గించడంలో ఈ పండ్లు మనకు సహాయపడతాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు మన దరి చేరుకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ పండ్లను తీసుకోవడం వల్ల మనం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటాము. ఈ విధంగా మల్ బెర్రీ పండ్లు మనకు ఎంతగానో సమాయపడతాయని వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.