Meal Maker Curry : మీల్ మేక‌ర్‌ల‌ను ఇలా చేస్తే.. చికెన్‌, మ‌ట‌న్ కూడా ప‌నికిరావు..!

Meal Maker Curry : మీల్ మేకర్ ల‌లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మీల్ మేక‌ర్ ల‌ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. కింద చెప్పినా విధంగా చేసే మీల్ మేక‌ర్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మీల్ మేక‌ర్ ల‌తో రుచిగా, సుల‌భంగా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్ మేక‌ర్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – 2 గ్లాసులు, మీల్ మేక‌ర్ – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌, స్టోన్ ప్ల‌వ‌ర్ – కొద్దిగా, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 5, సోంపు గింజ‌లు – ఒక టీ స్పూన్, త‌రిగిన ట‌మాట – 1, నూనె – 3 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – ముప్పావు క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Meal Maker Curry recipe very tasty how to cook
Meal Maker Curry

మీల్ మేక‌ర్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక ఇందులో ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత మీల్ మేక‌ర్ ల‌ను వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి. త‌రువాత వీటిని చేత్తో పిండుతూ మ‌రో గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో దాల్చిన చెక్క‌, స్టోన్ ప్ల‌వ‌ర్, ల‌వంగాలు, యాల‌కులు, ధ‌నియాలు, మిరియాలు వేసి వేయించాలి. త‌రువాత ఎండు కొబ్బ‌రి ముక్క‌లు, జీడిప‌ప్పు, సోంపు గింజ‌లు వేసి వేయించాలి. ఇలా వేయించిన మ‌సాలాల‌ను ఒక జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో ట‌మాట ముక్క‌ల‌ను వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి బాగా వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.

ఇలా వేయించిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మీల్ మేక‌ర్ ల‌ను వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ముప్పావు క‌ప్పు నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత మిక్సీ పట్టుకున్న పొడిని వేసి క‌ల‌పాలి. దీనిపై మూత‌ను ఉంచి మ‌రో 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. కూర మ‌రీ పొడిగా ఉంటే మ‌రి కొన్ని నీళ్లను కూడా పోసుకోవ‌చ్చు. మీల్ మేక‌ర్ లు మెత్త‌గా ఉడికిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ కర్రీ త‌యార‌వుతుంది. ఈ కూర‌ను దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మీల్ మేక‌ర్ ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts