Bananas : అర‌టి పండ్ల‌ను ఈ స‌మ‌యంలో తినండి.. అద్భుత‌మైన ఫ‌లితాలు ఉంటాయి..

Bananas : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అర‌టి పండ్లు మ‌న‌కు స‌హ‌జంగానే ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. పైగా ధ‌ర కూడా త‌క్కువే. క‌నుక ఈ పండ్ల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. అయితే అర‌టి పండ్ల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు తిన‌కూడ‌దు. రోజులో ఒక నిర్దిష్ట‌మైన స‌మ‌యంలో మాత్రమే తినాలి. దీంతో అన్ని పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. లాభాలు కూడా కలుగుతాయి. ఇక అర‌టి పండ్ల‌ను ఎప్పుడు తినాలి.. వీటితో ఎలాంటి లాభాలు క‌లుగుతాయి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అర‌టి పండ్ల‌ను ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌తో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి రోజులో కావ‌ల్సిన ఫైబ‌ర్ ఉద‌య‌మే ల‌భిస్తుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. అర‌టి పండ్ల‌ను ఉద‌యాన్నే తిన‌డం వ‌ల్ల బీపీ పేషెంట్ల‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. ఎందుకంటే ఈ పండ్ల‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది ఉద‌యాన్నే శ‌రీరానికి ల‌భిస్తుంది. దీంతో రోజంతా బీపీ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. క‌నుక బీపీ వ్యాధిగ్ర‌స్తులు ఉద‌యం అర‌టి పండ్ల‌ను తింటే మేలు జ‌రుగుతుంది.

take Bananas at this time to get more benefits
Bananas

రోజంతా శారీర‌క శ్ర‌మ చేసేవారు, విద్యార్థులు ఉద‌యం అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌క్తి బాగా ల‌భిస్తుంది. మెద‌డు యాక్టివ్‌గా ఉంటుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ప‌నిచేస్తారు. చ‌దువుపై ఏకాగ్ర‌త పెరుగుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగు ప‌డుతుంది. అర‌టి పండ్ల‌ను ఉద‌యం తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయని సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు.

అర‌టి పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క‌నుక రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. కాబ‌ట్టి ఉద‌యాన్నే ఈ పండ్ల‌ను తింటే రోజంతా శ‌రీరం సుర‌క్షితంగా ఉంటుంది. వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. అలాగే అర‌టి పండ్ల‌ను ఉద‌యం తిన‌డం వ‌ల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల‌పై భారం ప‌డ‌కుండా ఉంటుంది. క‌నుక ఉద‌యాన్నే అర‌టి పండ్ల‌ను తింటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts