Joint Pain : ఒకప్పుడు రక్తపోటుతో బాధపడే వారు చాలా తక్కువగా ఉండేవారు. 50 సంవత్సరాలు పైబడిన వారే ఎక్కువగా ఈ రక్తపోటు బారిన పడే వారు. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే రక్తపోటు బారిన పడుతున్నారు. ఇలా రక్తపోటు బారిన పడడానికి కారణం అయోడైజ్డ్ ఉప్పును వాడడమేనని నిపుణులు చెబుతున్నారు. పూర్వకాలంలో రాళ్ల ఉప్పునే ఎక్కువగా ఉపయోగించేవారు. అందుకే వారు రక్తపోటు బారిన పడే వారు కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గాలన్నా, రక్తశుద్ధి జరగాలన్నా , రక్తపోటు నియంత్రణలో ఉండాలన్నా అయోడైజ్డ్ ఉప్పుకు స్వస్థి చెప్పి రాళ్ల ఉప్పును ఉపయోగించాల్సిందేనని వారు చెబుతున్నారు.
అయోడైజ్డ్ ఉప్పు అసలు ఉప్పే కాదని అది నకిలీ ఉప్పని వారు తెలిపారు. సోడియం, క్లోరైడ్, అయోడిన్ అనే రసాయనాలతో దీనిని తయారు చేస్తారు. ఈ ఉప్పు నీటిలో కరగదు. స్ఫటికంలాగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఉప్పును తీసుకున్నా అది శరీరంలో కూడా అలాగే ఉంటుంది. ఈ ఉప్పును ఉపయోగించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. రక్తపోటును కూడా పెంచుతుంది. ఈ ఉప్పును కర్మాగారాల్లో తయారు చేస్తారు. రాళ్ల ఉప్పును సముద్రం నుండి తయారు చేస్తారు. ఎండలో ఎండబెడతాఉ. ఈ రాళ్ల ఉప్పులో సహజసిద్దమైన 72 ఖనిజ లవణాలు ఉంటాయి. ఇందులో కూడా సోడియం, క్లోరైడ్,అయోడిన్ లు ఉంటాయి. కానీ అవి సహజమైనవి.
ఈ ఉప్పు నీళ్లల్లో వెంటనే కరిగిపోతుంది. శరీరంలోనూ కరిగిపోతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. కండరాలు మొద్దుబారిపోవడం, తిమ్మిర్లు రావడం వంటివి తగ్గిపోతాయి. రాత్రి వేళల్లో పిక్కలు పట్టుకుపోతే ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పును వేసి కలిపి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల 5 నిమిషాల్లోనే సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల అరికాళ్ల నొప్పులు, కండరాలు పట్టుకుపోవడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. రాళ్ల ఉప్పును వాడడం మొదలు పెట్టిన తరువాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరం మందులకు స్పందించడం ప్రారంభిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రాళ్ల ఉప్పులో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. రెండున్నర టీ స్పూన్ల రాళ్ల ఉప్పును 15 గ్లాసుల నీటిలో కలిపి అప్పుడప్పుడూ తాగుతూ ఉంటే రక్తపోటు దరిదాపుల్లోకి కూడా రాదని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో ఉప్పు లేకపోతేనీరు నిలవడం అసాధ్యం. శరీరంలో నీరు నిలబడకపోతే రక్తనాళాలు సజావుగా పని చేయవు. శరీరంలో నీటి శాతం ఏ మాత్రం తగ్గిన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాళ్ల ఉప్పు వల్ల శరీరంలో 95 శాతం వరకు నీరు నిలుస్తుంది. శరీరం నుండి సక్రమంగా చెమట, మూత్రం బయటకు పోవడానికి రాళ్ల ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఔషధంగా కూడా మనకు రాళ్ల ఉప్పును ఉపయోగించవచ్చు. శరీరంలో నొప్పులతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. రాళ్ల ఉప్పుతో ఈ నొప్పులను తగ్గించుకోవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును, వామును వేసి వేడి చేయాలి. ఉప్పు కొద్దిగా వేడిగా అయిన తరువాత అందులో నీళ్లు పోసి ఉప్పు కరిగే వరకు కలుపుతూ ఉండాలి. తరువాత ఈ నీటిని బాగా మరిగించాలి.
ఇలా తయారు చేసుకున్న నీటిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ వస్త్రాన్ని తీసుకుని నీటిలో ముంచి దానితో నొప్పులు ఉన్న చోట రాయాలి. ఇలా రోజుకు రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. అదే విధంగా ఒక గిన్నెలో నీటిని పోసి అందులో రాళ్ల ఉప్పును వేసి ఉప్పు కరిగే వరకు నీటిని వేడి చేయాలి. తరువాత ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతునొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ ల వంటివి తగ్గుతాయి. ఈ విధంగా రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అయోడైజ్డ్ సాల్ట్ కు బదులుగా రాళ్ల ఉప్పునే ఉపయోగించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.