పండ్లు

రోజూ ఒక దానిమ్మ పండును తినండి.. మీ షుగ‌ర్ దెబ్బ‌కు దిగి వ‌స్తుంది..!

చూడగానే ఎర్రగా నోరూరించే దానిమ్మ పండుని చాలా మంది తిన‌డానికి ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు.దానిమ్మ అనేది ఆరోగ్యకరమైన మరియు పోషక విలువలతో నిండిన పండు. దీని గింజలు ప్రతిరోజూ తినడం ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ గింజలు విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్, పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు మరియు పలు ఖనిజాలు కలిగి ఉండ‌డంతో ఇది తిన‌డం వ‌ల‌న చాలా ప్రయోజ‌నాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు యాంటీ ఆక్సిడెంట్లు మరియు పొలిఫినాల్స్ అనే రసాయనాలతో నిండి ఉంటాయి. ఇవి రక్తనాళాలను శుభ్రపరచి, కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. రక్తప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి, దాంతో గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలను తగ్గించవచ్చు.

డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లు తినవచ్చని, దానిమ్మ పండులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణాలు, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరిచే గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. డయాబెటిస్ బాధితులకు దానిమ్మ పండు ఆహారంలో అద్భుతమైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. ఇతర పండ్ల రసాల కంటే దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రత్యేకంగా ఫాలీ ఫెనాల్స్ ఎక్కువగా ఉండ‌డం వ‌ల‌న ఇది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, గుండెను రక్షించడంలో కూడా కీలకంగా పనిచేస్తుందని చెబుతున్నారు.మధుమేహం ఉన్నవారు మూడు నెలల పాటు దానిమ్మ రసాన్ని తీసుకుంటే అధిరోస్క్రైకోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు

take one pomegranate daily to reduce sugar levels

హానికరమైన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను కూడా దానిమ్మ తగ్గిస్తుందని చెబుతున్నారు. దానిమ్మ పండులో ఉండే చక్కెర యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి, ఇది మధుమేహ బాధితులకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అంటున్నారు.దానిమ్మ పండు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారమని, అధిక చెక్కెర స్థాయిలు ఉన్నవారికి కూడా దానిమ్మ పండు తినడం హాని చేయదని చెబుతున్నారు. ఇది నిత్యం తింటే చాలా ప్ర‌యోజ‌నం, ఒక‌సారి డాక్ట‌ర్‌ని అడిగి తెలుసుకుని తింటే మ‌రి మంచిది.ఇందులో పీచు, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ పండ్లని ఎక్కువగా తీసుకుంటే ఈ పోషకాలన్నీ అందుతాయి.

Share
Sam

Recent Posts