Peaches : ఈ పండ్లు బ‌య‌ట మార్కెట్‌లో ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా తెచ్చుకుని తినండి..!

Peaches : మార్కెట్‌కు వెళితే మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల పండ్లు ల‌భిస్తుంటాయి. వాటిల్లో ఎన్నో ర‌కాలు ఉంటాయి. కొన్ని ర‌కాల పండ్ల గురించి అయితే చాలా మందికి ఇప్ప‌టికీ తెలియ‌దు. ఎందుకంటే అలాంటి పండ్లు మ‌న దేశంలో పండ‌వు క‌నుక‌. విదేశాల నుంచి వాటిని దిగుమ‌తి చేసుకుంటారు కాబ‌ట్టి చాలా వ‌ర‌కు అలాంటి పండ్ల గురించి మ‌న‌లో అధిక శాతం మందికి తెలియ‌దు. ఇక అలాంటి పండ్ల‌లో పీచ్ పండ్లు కూడా ఒక‌టి. ఇవి చూసేందుకు నారింజ‌, ఎరుపు రంగులో క‌ల‌గ‌లిపి ఉంటాయి. ఒక్కోసారి ఇవి యాపిల్స్ లాగా కూడా క‌నిపిస్తాయి. అయితే ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పీచ్ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. దీంతోపాటు గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి కూడా ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ఈ పండ్ల‌లోని ఫైబ‌ర్ ఆక‌లిని నియంత్రిస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. ఫ‌లితంగా త‌క్కువ ఆహారం తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. అలాగే ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ రోగుల్లో షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతోపాటు శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

take Peaches for many wonderful health benefits
Peaches

విట‌మిన్ సి ఎక్కువ‌..

పీచ్ పండ్ల‌లో విట‌మిన్ సి స‌మృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ‌ను ఇస్తుంది. ఈ పండ్ల‌ను తింటే చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. పీచ్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌ర‌రీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) స్థాయిలు త‌గ్గుతాయి. దీంతో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) స్థాయిలు పెరుగుతాయి. దీని వ‌ల్ల గుండెకు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు.

పీచ్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శిరోజాలు సైతం ఒత్తుగా, దృఢంగా, పొడ‌వుగా పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పండ్ల‌లో ఫైటో న్యూట్రియెంట్లు, పెక్టిన్ ఫైబ‌ర్ ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే లివ‌ర్‌లోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. దీంతోపాటు కిడ్నీలు కూడా క్లీన్ అవుతాయి. పీచ్ పండ్ల‌లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. దీంతో ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

నొప్పులు, వాపులు త‌గ్గుతాయి..

పీచ్ సండ్ల‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే శ‌రీరంలోని నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేసే విష‌యం. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం పీచ్ పండ్ల‌లో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్‌, క్వ‌ర్సెటిన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ క్యాన్స‌ర్ ఏజెంట్లుగా ప‌నిచేస్తాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటుంటే క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. ఇలా పీచ్ పండ్ల వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు కలుగుతాయి. క‌నుక ఇక‌పై మీకు ఎప్పుడైనా మార్కెట్‌లో ఇవి క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకుని తినండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts