Fruits : సాధారణంగా మనం రోజూ భిన్న రకాల ఆహారాలను తింటుంటాం. అయితే మనం తినే ఆహారాలను బట్టి అవి జీర్ణం అయ్యే సమయం మారుతుంది. శాకాహారం తింటే త్వరగా జీర్ణం అవుతుంది. మాంసాహారం అయితే జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. అయితే కొందరికి జీర్ణశక్తి సరిగ్గా ఉండదు. దీంతో వారు కొద్దిగా ఆహారం తిన్నా.. అది జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. అలాంటి వారు జీర్ణశక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఎవరైనా సరే భోజనం చేశాక.. ఏ పండ్లను తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక భోజనం చేశాక యాపిల్ పండ్లను తింటే మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, మలబద్దకం ఉండవు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. కనుక భోజనం చేశాక యాపిల్ పండ్లను తింటే మేలు జరుగుతుంది. అయితే భోజనం చేసిన వెంటనే పండ్లను తినరాదు. కనీసం 1 గంట విరామం ఇచ్చి ఆ తరువాత పండ్లను తినాలి. దీంతో మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలతోపాటు పండ్లలో ఉండే పోషకాలు కూడా మనకు సరిగ్గా అందుతాయి.
ఇక భోజనం చేశాక తినాల్సిన పండ్లలో అనేకం ఉన్నాయి. వాటిల్లో నారింజ, జామ, దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి. వీటిని కూడా భోజనం అనంతరం 1 గంట గ్యాప్ ఇచ్చి తినవచ్చు. ఇవి కూడా ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తాయి. జీర్ణ సమస్యలు రాకుండా చూస్తాయి. జీర్ణశక్తిని పెంచడంతోపాటు గ్యాస్, మలబద్దకం లేకుండా చూస్తాయి. కనుక భోజనం చేశాక ఈ పండ్లను తింటే ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.