పోష‌కాహారం

బొప్పాయి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

బొప్పాయి పండ్లు మనకు సీజన్లతో సంబంధం లేకుండా దాదాపుగా సంవత్సరం పొడవునా లభిస్తాయి. బొప్పాయి పండ్లను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. ఈ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడంలో బొప్పాయి పండ్లు గొప్పగా పనిచేస్తాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బొప్పాయి పండ్లలో విటమిన్‌లు ఎ, సి, కె లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో కణజాల వృద్ధికి, చర్మ సంరక్షణకు తోడ్పడుతాయి.

2. బొప్పాయి పండ్లలో ఫైబర్‌, ఫోలిక్‌ యాసిడ్, పొటాషియం, మెగ్నిషియం, కాపర్‌, జింక్‌ అధికంగా ఉంటాయి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు శరీరానికి శక్తి లభిస్తుంది.

3. ఒక కప్పు.. అంటే సుమారుగా 100 గ్రాముల బొప్పాయి పండ్లను తినడం వల్ల మనకు కేవలం 40 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. అందువల్ల అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ పండ్లను తినడం వల్ల మనకు రోజులో అవసరం అయ్యే విటమిన్‌ ఎ లో 20 శాతం, విటమిన్‌ సిలో 70 శాతం లభిస్తుంది.

many wonderful health benefits of papaya take them daily

4. డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్న వారు ఈ పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా షుగర్ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.

5. లివర్‌ వ్యాధులు, చర్మ సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండ్లను తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే ఈ పండ్లను తరచూ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు.

6. బొప్పాయి పండ్లలో పపైన్ అనబడే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే మలబద్దకం సమస్య తగ్గుతుంది.

7. బొప్పాయి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ నశిస్తాయి. క్యాన్సర్‌, గుండె జబ్బులు, ఇతర ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి.

Admin

Recent Posts