చిట్కాలు

తలనొప్పిని తగ్గించేందుకు ఇంటి చిట్కాలు..!

తలనొప్పి సమస్య అనేది సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, డీహైడ్రేషన్‌ వంటి అనేక కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. అయితే తలనొప్పిని తగ్గించుకునేందుకు ఇంగ్లిష్‌ మందులను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే తలనొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే…

1. తాజా ద్రాక్ష పండ్లతో జ్యూస్‌ తయారు చేయాలి. దాన్ని తాగితే తలనొప్పి తగ్గుతుంది. ఈ జ్యూస్‌ను రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు తాగితే ఫలితం ఉంటుంది.

2. ఒత్తిడి, ఒళ్లు నొప్పులను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లంతో డికాషన్‌ తయారు చేసుకుని తాగాలి. అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగవచ్చు. దీంతో ఇంకా త్వరగా తలనొప్పి తగ్గుతుంది.

wonderful home remedies to reduce headache must know

3. దాల్చిన చెక్క ఆహారానికి రుచిని అందిస్తుంది. అలాగే తలనొప్పిని తగ్గిస్తుంది. దాల్చిన చెక్కను పొడి చేసి అందులో కొద్దిగా నీరు కలిపి నుదుటిపై రాయాలి. తలనొప్పి తగ్గుతుంది. లేదా దాల్చిన చెక్కతో తయారు చేసే కషాయం కూడా తాగవచ్చు.

4. తలనొప్పి బాగా ఉన్నప్పుడు మసాజ్‌ చేయాలి. మెడ, తల భాగాలపై సున్నితంగా మర్దనా చేయాలి. దీంతో ఆయా భాగాల్లో రక్త సరఫరా పెరుగుతుంది. తలనొప్పి తగ్గుతుంది.

5. శరీరంలో తగినంత నీరు లేకపోయినా, డీహైడ్రేషన్‌ వల్లనైనా తలనొప్పి వస్తుంది. కనుక ఈ తరహా తలనొప్పి నుంచి బయట పడాలంటే నీటిని బాగా తాగాలి. అలాగే కీరదోస, తర్బూజా, పుచ్చకాయలను తినవచ్చు. తలనొప్పి తగ్గుతుంది.

Admin

Recent Posts