పోష‌కాహారం

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను రోజూ విడిచిపెట్ట‌కుండా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Pomegranate : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. దానిమ్మ పండ్ల‌ను ఎవ‌రైనా స‌రే తిన‌వ‌చ్చు. సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. అయితే దానిమ్మ పండ్ల‌ను తినలేని వారు రోజూ దాని ర‌సం క‌నీసం ఒక గ్లాస్ అయినా స‌రే తాగాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. దానిమ్మ పండ్ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ పండ్ల‌లో శక్తివంతమైన పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి ర‌క్త‌నాళాల‌ను శుభ్రం చేస్తాయి. దీంతో ర‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే దానిమ్మ ర‌సం రక్తపోటు తగ్గటానికి సహాయపడుతుంది. దానిమ్మలో అనేక పోష‌కాలు ఉండ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజ‌రైడ్స్, రక్తపోటు తగ్గడానికి సహాయపడుతాయి. దీంతో శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక దానిమ్మ పండ్ల‌ను రోజూ తింటే షుగ‌ర్ త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్లడిస్తున్నాయి. క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారు రోజూ క‌నీసం ఒక్క దానిమ్మ పండును అయినా స‌రే తినాల్సి ఉంటుంది.

many wonderful health benefits of pomegranate

ఇక ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ప‌లు క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. అజీర్ణం, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్రంగా మారుతుంది. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయి క‌నుక దానిమ్మ పండ్ల‌ను విడిచిపెట్ట‌కుండా రోజూ తినండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Admin

Recent Posts