వినోదం

Aravinda Sametha : అర‌వింత స‌మేత మూవీని వ‌దులుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Aravinda Sametha : త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన అర‌వింద సమేత మూవీ ఎంతటి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మూవీ ఎన్‌టీఆర్‌తోపాటు అటు త్రివిక్ర‌మ్‌, పూజా హెగ్డెల కెరీర్‌లోనూ ప్ర‌త్యేకంగా నిలిచిపోతుంది. ఇక ఈ మూవీలో న‌టి ఈశ్వ‌రీ రావు రెడ్డ‌మ్మ పాత్ర‌లో న‌టించి మెప్పించింది. జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా అద‌ర‌గొట్టేశారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమిటంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అరవింద సమేత చిత్రంలో నటి ఈశ్వరీరావు పోషించిన రెడ్డమ్మ పాత్రకోసం ముందుగా లయని చిత్ర యూనిట్ అడిగిందట. అయితే అనివార్య కారణాలతో అందులో నటించడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత ప్రముఖ నటి ఈశ్వరీరావుకి ఆ ఛాన్స్ దక్కింది. రెడ్డమ్మ పాత్రకి ఆమె నూరు శాతం న్యాయం చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు.

do you know who missed to do aravinda sametha movie

కాగా లయ సినిమాల్లో చేస్తున్న రోజుల్లో రాజకీయ ప్రచారంలో కూడా పాల్గొంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ విజయవాడ లోక్ సభ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీచేస్తే ఆయనకు మద్దతుగా ప్రచారం చేసింది. ఇక సినిమాల్లో రాణిస్తున్న సమయంలో అమెరికాకి చెందిన గణేష్ గుర్తి అనే ఓ వైద్యుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక సినిమాలకు పూర్తిగా దూరమైన‌ లయ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఉంటోంది. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 2018 లో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో హీరో తల్లి పాత్రలో చేసింది. కానీ ఆ మూవీ డిజాస్ట‌ర్ అయింది. అయితే ఇక‌పై ఆమె సినిమాలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది. కానీ త‌న కుమార్తెను సినీ రంగ ప్ర‌వేశం చేయిస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం మాత్రం తెలియాల్సి ఉంది.

Admin

Recent Posts