Black-Eyed Peas : బొబ్బెర గింజ‌లు ఎంత బ‌ల‌మంటే.. చికెన్‌, మ‌ట‌న్ కూడా ప‌నికిరావు..!

Black-Eyed Peas : మ‌న‌లో చాలా మందికి మొల‌కెత్తిన విత్త‌నాలను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. మ‌నం ఎక్కువ‌గా పెస‌లు, శ‌న‌గ‌ల‌ను మొల‌కెత్తిన విత్త‌నాలుగా చేయ‌డంలో ఉప‌యోగిస్తూ ఉంటాం. వీటితోపాటుగా మ‌నం బొబ్బెర గింజ‌ల‌ను కూడా మొల‌కెత్తిన విత్త‌నాలుగా చేసి ఆహారంలో భాగంగా తీసుకోవ‌చ్చు.

amazing health benefits of Black-Eyed Peas
Black-Eyed Peas

మ‌నం అనేక ర‌కాల గింజ‌ల‌ను మొల‌కెత్తిన విత్త‌నాలుగా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. కానీ కొన్ని గింజ‌ల పై భాగం గట్టిగా ఉంటుంది. ఇలాంటి గింజ‌ల‌ను మొల‌కెత్తిన విత్త‌నాలుగా చేయ‌డం వ‌ల్ల మొల‌కలు త్వ‌ర‌గా రావు. ఇలాంటి విత్త‌నాల‌ను ఎక్కువ‌గా కూడా తిన‌లేము. అవి త్వ‌ర‌గా జీర్ణమ‌వ్వ‌క అజీర్తి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. బొబ్బెర గింజ‌ల పైభాగం మెత్త‌గా ఉంటుంది. క‌నుక ఈ గింజ‌ల‌ను ఎక్కువ‌గా తిన‌వ‌చ్చు. త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. 100 గ్రాముల ఎండు బొబ్బెర గింజ‌లల్లో 14 గ్రాముల నీటి శాతం, 54 గ్రాముల పిండి ప‌దార్థాలు, 24 గ్రాముల ప్రోటీన్స్‌, 1 గ్రాము కొవ్వు, 4 గ్రాముల పీచు ప‌దార్థాలు, 323 క్యాల‌రీలు ఉంటాయి.

ఐర‌న్ ను ఎక్కువ‌గా క‌లిగి ఉన్న వాటిల్లో బొబ్బెర గింజ‌లు ఒక‌టి. 100 గ్రాముల ఎండు బొబ్బెర గింజ‌లల్లో 9 మిల్లీ గ్రాముల ఐర‌న్ ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు ల‌భించడ‌మే కాకుండా ర‌క్త హీన‌త నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వృక్ష సంబంధ‌మైన ప‌దార్థాల నుండి ల‌భించే ప్రోటీన్స్ మ‌న శరీరానికి ఎక్కువగా మేలు చేస్తాయి. బొబ్బెర గింజ‌ల‌ల్లో మాంసంలో ఉండే ప్రోటీన్స్ కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. మాంసాహారం తిన‌లేని వారు బొబ్బెర గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ లభిస్తాయి.

కొంద‌రిలో బొబ్బెర గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది. అలాంటి వారు బొబ్బెర కాయ‌ల‌ను కూర‌గా చేసుకుని తిన‌వ‌చ్చు. బొబ్బెర గింజ‌ల నుండి మొల‌క‌లు త్వ‌ర‌గా వ‌స్తాయి. ఈ మొల‌క‌ల‌ను రెండు అంగుళాల ప‌రిమాణంలో పెరిగే వ‌ర‌కు ఉంచ‌డం వ‌ల్ల వీటిల్లో సూక్ష్మ పోష‌కాలు అధికంగా త‌యార‌వడ‌మే కాకుండా త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. దంతాల స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డే వారు బొబ్బెర మొల‌క‌ల‌ను మ‌రుగుతున్న నీటిలో వేసి 4 నిమిషాల త‌రువాత తీసుకుని తినాలి. బొబ్బెర గింజ‌ల‌తో మ‌నం గుగ్గిళ్ల‌ను కూడా త‌యారుచేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా బొబ్బెర గింజల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

D

Recent Posts