Annatto Seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది కంప్యూటర్ లకు ఎదురుగా కూర్చొని చేసే ఉద్యోగాలను చేస్తున్నారు. దీంతో చాలా మంది కళ్లకు సంబంధించిన సమస్యల బారిన పడుతున్నారు. కంటి మీద లైట్ల వెలుగు పడే కొద్ది ఫొటో టాక్సిసిటి పెరిగి రెటీనాలో ఉండే మ్యాక్యులా దెబ్బతింటుంది. చూపు మందగించడం, మసకగా కనబడడం, కంటి చూపులో మార్పులు రావడం సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. కంటి రెటీనాలో ఉండే మ్యాక్యులా అనే భాగం దెబ్బతినకుండా చేయడంలో అన్నాట్టో గింజలు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ గింజలు మనకు మార్కెట్ లో లేదా ఆన్ లైన్ లో విరివిరిగా లభిస్తాయి. ఈ గింజల్లో ఉండే బిక్సిన్, నార్ బిక్సిన్ అనే రసాయన మూలకాలు ఉంటాయి. ఇవి కంటిలో విడుదలయ్యే ఎ జెడ్ ఇ అనే మూలకం యొక్క ప్రభావాన్ని తగ్గించి రెటీనాలో ఉండే మ్యాక్యులా దెబ్బతినకుండా చేస్తాయి.
అలాగే మ్యాక్యులాకు రక్తప్రసరణ చక్కగా జరిగేలా చయడంలో కూడా ఈ రసాయన మూలకాలు ఉపయోగపడతాయి. కంటిలో విడుదలయ్యే ఎ జెడ్ ఇ అనే మూలకం అధిక రక్తపోటు ఉన్నవారిలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్న వారిలో కూడా ఈ మూలకం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉన్న వారిలో కంటిచూపు దెబ్బతింటుందని మనందరికి తెలుసు. ఇలా కంటి చూపు దెబ్బతిన్నకుండా చేయడంలో ఈ అన్నాట్టో గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొందరిలో డయాబెటిస్ లేకున్నా, రక్తపోటు లేకున్నా కూడా కంటి చూపు దెబ్బతింటుంది. అలాంటి వారు కూడా ఈ అన్నాట్టో గింజలను ఉపయోగించడం వల్ల కంటి చూపు దెబ్బతినకుండా చేసుకోవచ్చు. కంటి చూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు ఈ అన్నాట్టో గింజలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ గింజలను పొడిగా చేసి సలాడ్స్ లో చల్లుకోవచ్చు. అలాగే వంటల్లో కూడా పొడిగా చేసి వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ అన్నాట్టో గింజలను ఉపయోగించడం వల్ల కంటి చూపుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ గింజలను ఉపయోగించడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మలబద్దకాన్ని తగ్గించడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో, గాయాలు త్వరగా మానేలా చేయడంలో కూడా ఈ అన్నాట్టో గింజలు మనకు ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో కంప్యూటర్ లను, సెల్ ఫోన్ లను, ల్యాప్ టాప్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటిని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే మన కంటి చూపు అంత ఎక్కువగా దెబ్బతింటుంది. కంటి చూపుకు సంబంధించిన సమస్యలు వచ్చి ఇబ్బందులు పడుతున్న వారు ఈ అన్నాట్టో గింజలను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.