Egg Fry : కోడిగుడ్ల ఫ్రైని ఇలా చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..

Egg Fry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నింటిని క‌లిగి ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని మనంద‌రికి తెలుసు. ఈ కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో కోడిగుడ్డు ఫ్రై ఒక‌టి. చాలా మంది ఈ కోడిగుడ్డు ఫ్రైను ఇష్టంగా తింటారు. ఈ కోడిగుడ్డు ఫ్రైలో వెల్లుల్లి కారం వేసి కూడా మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా చేసే కోడిగుడ్డు ఫ్రై త‌ర‌చూ చేసే కోడిగుడ్డు ఫ్రై కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 10 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. వెల్లుల్లి కారం వేసి కోడిగుడ్డు ఫ్రైకు ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కోడిగుడ్లు – 4, నూనె – 2 టేబుల్ స్పూన్స్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 8, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Egg Fry recipe in telugu perfect way of cooking
Egg Fry

కోడిగుడ్డు ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా రోట్లో వెల్లుల్లి రెబ్బ‌లు, కారం వేసి క‌చ్చా ప‌చ్చాగా దంచుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో కోడిగుడ్ల‌ను వేసి అంతా క‌లిసేలా గంటెతో లేదా బీట‌ర్ తో క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి. దీనిని క‌ద‌ప‌కుండా వేయించాలి. కోడిగుడ్డు మిశ్ర‌మం ఒక‌వైపు వేగిన త‌రువాత మ‌రో వైపుకు తిప్పుకుని వేయించాలి. త‌రువాత కావ‌ల్సిన ఆకారంలో ముక్క‌లుగా చేసుకుని వేయించాలి. కోడిగుడ్డు చ‌క్క‌గా వేగిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారం వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 3 నిమిషాల పాటు వేయించాలి.

తరువాత కొత్తిమీర చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే ఎగ్ ఫ్రై కంటే ఈ విధంగా చేసిన ఎగ్ ఫ్రై మ‌రింత రుచిగా ఉంటుంది. వంట ఏం చేయాలో తోచ‌న‌ప్పుడు, ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా కోడిగుడ్ల‌తో ప‌ది నిమిషాల్లోనే ఫ్రైను త‌యారు చేసుకుని తిన‌వచ్చు. ఈ ఫ్రైను అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts