Avise Ginjalu : ఈ గింజలను గుప్పెడు మోతాదులో తీసుకుంటే చాలు.. ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాము. అలాగే నొప్పులు లేకుండా హాయిగా జీవించవచ్చు. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ గింజలు ఏంటని ఆలోచిస్తున్నారా అవి మరేవో కాదు అవిసె గింజలు. ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం అధిక కొవ్వు. అధిక కొవ్వు వల్ల గుండె జబ్బులతో పాటు మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతూ ఉంటాం. ఈ అధిక కొవ్వు సమస్య నుండి బయట పడేయంలో మనకు ఈ అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. వైద్యులు సైతం వీటిని ఆహారంగా తీసుకోమని సూచిస్తూ ఉన్నారు.
అవిసె గింజల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె జబ్బుల బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి. అలాగే బరువు తగ్గడంలో కూడా ఈ అవిసె గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవే కాకుండా ఈ అవిసె గింజలను తీసుకోవడం వల్ల మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ అవిసె గింజలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. వీటిని ఎలా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అవిసె గింజలను మొలకెత్తించి తీసుకోవడం వల్ల మనం వీటిలోని పోషకాలను పూర్తి స్థాయిలో పొందవచ్చు. అయితే చాలా మంది వీటిని మొలకెత్తించి తీసుకోవడానికి కష్టంగా భావిస్తారు.
ఇలా మొలకెత్తించి తీసుకోలేని వారు వీటిని పొడిగా చేసి తీసుకున్నా కూడా ఈ అవిసె గింజల్లోని పోషకాలన్నింటిని పొందవచ్చు. ముందుగా అవిసె గింజలను 5 నిమిషాల పాటు చిన్న మంటపై వేయించి ఆ తరువాత పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ ఉదయం పరగడుపున ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల అవిసె గింజల్లో ఉండే పోషకాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి. అంతేకాకుండా ఈ అవిసె గింజల పొడిని గోధుమపిండితో కలిపి చపాతీలా చేసుకుని తినవచ్చు. అలాగే పెరుగులో కూడా కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా అవిసె గింజలను తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ అవిసె గింజల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఐరన్ వంటి మినరల్స్ తో పాటు విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్ వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అలాగే వీటిలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కొలెస్ట్రాల్ అసలు ఉండనే ఉండదు. అవిసెగింజల పొడిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే దీనిలో ఉండే ఫైబర్ పెద్ద ప్రేగు క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి. చిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
దీంతో మనం బరువు తగ్గడంతో పాటు గుండె జబ్బుల బారిన కూడా పడకుండా ఉంటాము. అలాగే ఈ అవిసె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నశింపజేస్తాయి. దీంతో మనం క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. అలాగే మోనోపాజ్ దశలో తలత్తే సమస్యలతో ఇబ్బంది పడే స్త్రీలు అవిసె గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ గింజల్లో ఉండే క్యాల్షియం ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వాపులు కూడా క్రమంగా తగ్గుతాయి. షుగర్, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడే వారు ఈ అవిసె గింజల పొడిని పరగడుపున తీసుకోవడం వల్ల ఆయా సమస్యలు అదుపులో ఉంటాయి. మన ఆరోగ్యంతో పాటు మన అందానికి కూడా అవిసె గింజలు ఎంతగానో సహాయపడతాయి.
అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం పై ఉండే ముడతలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. అలాగే జుట్టు కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. జుట్టు ఒత్తుగా, ధృడంగా పెరుగుతుంది. ఈ విధంగా అవిసె గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అవిసె గింజల పొడిని తీసుకోవడంతో పాటు వీటితో కారం పొడి, లడ్డూ వంటి వాటిని కూడా తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.