Black Eyed Peas : ప్రస్తుత తరుణంలో చాలా మంది డయాబెటిస్ సమస్యతో సతమతం అవుతున్నారు. దీని కారణంగా ఏటా కొన్ని కోట్ల మంది ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నారు. చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. అస్తవ్యస్తమైన జీవన విధానం వల్లనే చాలా మంది షుగర్ బారిన పడుతున్నారు. అయితే షుగర్‌ను నియంత్రించాలంటే రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో అలసందలు ఒకటని చెప్పవచ్చు. ఇవి మనకు బయట మార్కెట్‌లో లభిస్తాయి. కొందరు వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు. ఇవి భిన్న రకాలుగా ఉంటాయి.
అయితే అలసందలను రోజూ ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టి తింటే దాంతో షుగర్ పూర్తిగా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలసందల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కనుక ఇవి షుగర్‌ను తగ్గిస్తాయి. కాబట్టి వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా షుగర్‌ను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల కేవలం షుగర్ తగ్గడం మాత్రమే కాదు.. ఇంకా పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అలసందల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్, ఫోలేట్, ఐరన్, పొటాషియం, విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిల్లో మెగ్నిషియం, జింక్, బి విటమిన్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవన్నీ మనకు పోషణను, శక్తిని అందిస్తాయి. పోషకాహార లోపం రాకుండా చూస్తాయి. ఇక అలసందల్లో ఉండే ఫైబర్ జీర్ణశక్తి పెంచుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీంతో అజీర్తి సమస్య తగ్గుతుంది. అలాగే మలబద్దకం తగ్గుతుంది. రోజూ కప్పు వీటిని తింటే సుఖ విరేచనం అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి.
వీటిని రోజూ ఒక కప్పు మోతాదులో తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గి దాంతో హార్ట్ ఎటాక్‌లు రావు. అలాగే పలు రకాల క్యాన్సర్లు సైతం రాకుండా ఉంటాయి. ఇక వీటిని తినడం వల్ల పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బులు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలసందలను తినడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం ఇట్టే కరిగిపోతుంది. వీటిని కొంచెం తిన్నా చాలు.. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గేందుకు అవకాశాలు మెరుగు పడతాయి.
అలసందల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ రాకుండా చూస్తాయి. అలాగే వీటిల్లో కాల్షియం కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా అలసందలను రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ ఉడకబెట్టి కప్పు మోతాదులో తినడం మరిచిపోకండి.