Flax Seeds In Telugu : అవిసె గింజలు.. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల తీసుకోవడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవిసె గింజల్లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఆహారంలో భాగంగా అవిసె గింజలను తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అజీర్తి వంటి సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగించి అధిక బరువు సమస్య నుండి బయట పడేలా చేయడంలో కూడా ఈ అవిసె గింజలు మనకు ఉపయోగపడతాయి.
ఈ అవిసె గింజలను ఎలా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అవిసె గింజలను కళాయిలో వేసి దోరగా వేయించాలి. తరువాత ఈ గింజలను జార్ లో వేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో ఉంచి నెలరోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ మోతాదులో తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అవిసె గింజల్లో పాలీ అన్ స్యాచురేటేడ్, మోనో అన్ స్యాచురేటేడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. అలాగే వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు అవిసె గింజలను ఈ విధంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు టీ స్పూన్ల అవిసె గింజల పొడిని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. శరీరంలో జీవక్రియల రేటును పెంచి బరువు తగ్గేలా చేయడంలో అవిసె గింజలు మనకు దోహదపడతాయి. అవిసె గింజలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు కూడా తొలగిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. అవిసె గింజలను తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
అవిసె గింజల పొడిని తినలేని వారు వీటిని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగి, అవిసె గింజలను తినాలి. రెండు వారాల పాటు అవిసె గింజలను ఈ విధంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే మార్పును మనం గమనించవచ్చు. పురుషులు వీటిని తీసుకోవడం వల్ల వారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. రోజూ ఒక టీ స్పూన్ అవిసె గింజలను లేదా అవిసె గింజల పొడిని తీసుకోవడం వల్ల వారిలో లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ విధంగా అవిసె గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.