Obesity In Kids : ప్రస్తుత తరుణంలో చిన్నారులు క్రీడలు సరిగ్గా ఆడడం లేదు. కంప్యూటర్లు, టీవీలు, ఫోన్లను బాగా ఉపయోగిస్తున్నారు. దీంతో డిజిటల్ తెరలను ఎక్కువగా వీక్షిస్తూ గంటల తరబడి కూర్చునే ఉంటున్నారు. పైగా జంక్ ఫుడ్స్, చిరు తిళ్లను ఎక్కువగా తింటున్నారు. దీంతో ఊబకాయం సమస్య ప్రస్తుతం చిన్నారుల్లో ఎక్కువవుతోంది. అధికంగా బరువు పెరుగుతూ లావుగా మారుతున్నారు. అయితే పిల్లలకు రోజూ కింద తెలిపిన ఆహారాలను ఇవ్వడం వల్ల వారిలో క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. దీంతో శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. సన్నగా మారుతారు. మరి అందుకు గాను పిల్లలకు రోజూ ఇవ్వాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. సీజనల్ పండ్లతోపాటు మార్కెట్‌లో ఎక్కువగా లభించే పండ్లను పిల్లలకు రోజూ ఇవ్వాలి. వాటిల్లో విటమిన్లు రె, సి, బి, ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల్లో జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొవ్వు కరుగుతుంది. చిన్నారులు అధిక బరువు తగ్గి సన్నగా మారుతారు. నారింజ, కివీలు, యాపిల్స్, దానిమ్మ వంటి పండ్లను ఇస్తే ఎంతగానో మేలు జరుగుతుంది.
2. పప్పు దినుసులకు కూడా పిల్లలకు రోజూ ఇవ్వాలి. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి చిన్నారులు అన్ని రకాలుగా ఎదిగేందుకు సహాయపడతాయి. పప్పు దినుసుల్లో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. దీంతో మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ తగ్గుతాయి. అలాగే శరీరంలోని కొవ్వు కరిగి సన్నగా మారుతారు.
3. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలను కూడా పిల్లలకు పెట్టాలి. వీటిల్లో ఐరన్, పొటాషియం, విటమిన్లు ఎ, సి, బి, కాల్షియం అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటి వల్ల చర్మం, జుట్టు పెరుగుదల బాగుంటుంది. చిన్నారులకు వెజిటబుల్ సూప్‌ను రోజూ ఇస్తే ముందు చెప్పిన పోషకాలన్నీ వారికి లభిస్తాయి. దీంతో వారిలో పెరుగుదలకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు. పైగా బరువు తగ్గి సన్నగా మారుతారు. ముఖ్యంగా పాలకూర, మెంతి ఆకు, బ్రోకలీ, టమాటా, క్యాబేజీ వంటి వాటిని పిల్లలకు ఇస్తే మేలు జరుగుతుంది.
4. అధిక బరువును తగ్గించడంలో తృణ ధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి. కేవలం పెద్దలు మాత్రమే కాదు.. పిల్లలు కూడా వీటిని తినాల్సిందే. తృణ ధాన్యాల్లో ఫైటిక్ యాసిడ్, ఫైబర్, జింక్, ఐరన్, మాంగనీస్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. దీంతో పిల్లలు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. బద్దకం అనేది ఉండదు. సోమరిపోతులుగా మారకుండా ఉంటారు. అలాగే శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా ఓట్స్, మినుములు, చిరు ధాన్యాలు ఇస్తే పిల్లలకు అమితమైన బలం లభిస్తుంది. బరువు కూడా తగ్గుతారు.
5. పిల్లలకు వెన్న తీసిన పాలు, పెరుగు రోజూ ఇస్తే మంచిది. అలాగే రోజుకో కోడిగుడ్డును పెట్టాలి. ఈ విధంగా ఆహారాలు ఇవ్వడం వల్ల వారికి సరైన పోషణ లభిస్తుంది. శక్తివంతులుగా మారుతారు. అధిక బరువు తగ్గి సన్నగా మారుతారు.