Foods : మన శరీరంలోని అన్ని అవయవాలు, కణాలకు రక్తాన్ని, పోషకాలను, ఆక్సిజన్‌ను అందించేందుకు వీలుగా రక్తనాళాలు నిర్మాణమై ఉంటాయి. ఇవి అన్ని భాగాలకు కావల్సిన శక్తిని, పోషణను అందిస్తాయి. ఈ క్రమంలోనే రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. దాంతో పోషకాలు, ఆక్సిజన్ అన్నీ శరీర భాగాలకు సక్రమంగా అందుతాయి. కానీ రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే శరీరానికి రక్తం సరఫరా కాదు. దీంతో పోషణ, ఆక్సిజన్ అందదు. అలాగే హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.
ఇక మనం తినే కొన్ని రకాల ఆహారాలు, తీసుకునే ద్రవాల కారణంగా రక్త నాళాల్లో కొవ్వు, వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అయితే అనారోగ్యాలను కలిగించే ఆహారాలను తీసుకుంటే మాత్రం రక్తనాళాల్లో మొత్తం అడ్డంకులే ఏర్పడుతాయి. దీంతో అవి పూర్తిగా బ్లాక్ అయిపోతాయి. అప్పుడు ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతాయి.
మనం తీసుకునే ఆహారాల వల్లనే చాలా వరకు రక్త నాళాలు బ్లాక్ అవుతుంటాయి. ముఖ్యంగా ఫ్రై చేయబడిన ఆహారాలను అధికంగా తీసుకుంటే వాటిల్లో ఉండే ట్రాన్స్‌ఫ్యాట్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)గా మారుతాయి. ఈ క్రమంలో ఆ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో చేరుతుంది. ఇక వేపుళ్లను అధికంగా తీసుకుంటే క్రమంగా ఆ కొలెస్ట్రాల్ మొత్తం రక్తనాళాల్లో పేరుకుపోయి అడ్డంకులు ఏర్పడుతాయి. దీంతో రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు సంభవిస్తాయి. కనుక వేపుళ్లను తీసుకోరాదు.
పాలు, పాల ఉత్పత్తులను కూడా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. వీటిల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది కూడా చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుంది. రక్త నాళాల్లో అడ్డంకిగా పేరుకుపోతుంది. దీంతో బ్లాక్స్ వస్తాయి. కాబట్టి వెన్న తీసిన పాలను, పాల ఉత్పత్తులను తీసుకుంటే మంచిది.
ఇక ఫాస్ట్‌ఫుడ్‌లను కూడా తినరాదు. ఇవి గుండె జబ్బులు, డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలకు కారణమవుతాయి. కనుక ఈ ఆహారాలను కూడా మానేయాలి. లేదంటే రక్తనాళాల్లో చెడు కొవ్వు (ఎల్‌డీఎల్) పేరుకుపోయి బ్లాక్స్ ఏర్పడుతాయి. గుండె హార్ట్ ఎటాక్‌లు వస్తాయి. కనుక ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోకూడదు.
అలాగే మద్యం సేవించడం కూడా మానేయాలి. అధిక మోతాదులో మద్యం సేవిస్తే అది శరీరంలో ఎల్‌డీఎల్ ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది. ఇది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. ఇబ్బందులు వస్తాయి. కనుక మద్యాన్ని మోతాదులో తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి.