పోష‌కాహారం

గ్రీన్ యాపిల్‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

రోజుకు ఒక యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాద‌ని చెబుతుంటారు. యాపిల్ పండ్ల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. అందుక‌నే రోజూ ఒక యాపిల్ పండును తిన‌మ‌ని చెబుతుంటారు. అయితే యాపిల్ పండ్ల‌లోనూ అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో గ్రీన్ యాపిల్ పండ్లు కూడా ఒక‌టి. సాధారణ యాపిల్ పండ్ల‌లాగే గ్రీన్ యాపిల్ పండ్లు కూడా మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తాయి. గ్రీన్ యాపిల్ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గిపోతాయి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

బీపీని త‌గ్గించ‌డంలోనూ గ్రీన్ యాపిల్స్ అద్భుతంగా ప‌నిచేస్తాయి. రోజుకు ఒక గ్రీన్ యాపిల్ పండును తింటుంటే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డి బీపీ త‌గ్గుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. ఆక‌లి లేని వారు ఈ పండ్ల‌ను తింటుంటే ఆక‌లి మెరుగు ప‌డుతుంది. తిన్న ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. గ్రీన్ యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం, పేగుల్లో ఆహారం సుల‌భంగా క‌దులుతుంది. దీంతో మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది. గ్రీన్ యాపిల్ పండ్ల‌ను తింటే జీర్ణాశ‌యం, పేగుల ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ శుభ్రంగా మారుతుంది.

take daily one green apple know what happens

ఈ పండ్ల‌లో ఐర‌న్‌, కాప‌ర్, మాంగ‌నీస్‌, పొటాషియం త‌దిత‌ర మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిల‌ను పెంచుతాయి. దీంతో శ‌రీరం యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా ప‌నిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ర‌క్తం త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. మెట‌బాలిజం మెరుగు ప‌డి క్యాల‌రీలు సులభంగా ఖ‌ర్చ‌వుతాయి. దీంతో కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. గ్రీన్ యాపిల్‌ను తింటే చ‌ర్మ క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. ఈ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఇలా ఈ పండ్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts