Millets : ఈ 3 ధాన్యాల‌ను రోజూ తింటే.. 100 ఏళ్లు జీవిస్తారు.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

Millets : ప్ర‌స్తుత కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇలా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో పోష‌కాహార లోప‌మ‌నే నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు ర‌కాల ధాన్యాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. ఈ ధాన్యాల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి మేలు ధాన్యాల్లో ముందు వ‌రుస‌లో ఉండేవి జొన్న‌లు. మ‌న శ‌రీరానికి జొన్న‌లు ఎంతో మేలు చేస్తాయి. ప్ర‌స్తుత కాలంలో వీటిని ఆహారంగా తీసుకోవ‌డం లేదు కానీ పూర్వ‌కాలంలో జొన్న‌లే ప్ర‌ధాన ఆహారంగా ఉండేవి. జొన్న‌ల‌తో జొన్న రొట్టెలు, జొన్న గ‌ట‌క‌, జొన్న అన్నం వంటి వాటిని వండుకుని తినే వారు.

అందుకే పూర్వ‌కాలంలో అంద‌రూ ఆరోగ్యంగా ఉండేవారు. జొన్న‌ల్లో చ‌క్కెర‌లు, పిండి ప‌దార్థాలు, ప్రోటీన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్ వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ మెరుగ‌ప‌డుతుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య తగ్గుతుంది. అధిక బ‌రువుతో, షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫలితాల‌ను పొంద‌వ‌చ్చు.

take these 3 types of Millets daily to live longer without diseases
Millets

అదేవిధంగా రాగుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అత్యంత ఆరోగ్య‌వంత‌మైన తృణ ధాన్యాలుగా రాగుల‌ను చెప్ప‌వ‌చ్చు. రాగుల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. రాగులు సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. రాగిపిండితో జావ‌, రాగి సంగ‌టి, రాగి రొట్టె వంటి వాటిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఎముక‌లను ధృడంగా చేసి కీళ్ల నొప్పులు వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో రాగులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పిల్ల‌ల‌కు కూడా రాగి జావ‌ను మ‌నం ఆహారంగా ఇవ్వ‌వ‌చ్చు. పిల్ల‌ల‌కు రాగి జావ‌ను ఆహారంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది.

మూత్రపిండాల వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారు రాగుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ర‌క్త‌హీన‌తో బాధ‌ప‌డే వారు, అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు రాగుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగుల‌ను వారానికి మూడు నుండి నాలుగు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. వృద్ధాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షించే ధాన్యాల్లో స‌జ్జ‌లు కూడా ఒక‌టి. మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో స‌జ్జ‌లు కీల‌క పాత్ర పోషిస్తాయి. స‌జ్జ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. త‌ల‌నొప్పి, ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డే వారు వీటిని స‌జ్జ‌ల‌తో వండిన ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. సజ్జ పిండిలో బెల్లాన్ని క‌లుపుకుని చ‌పాతీలుగా చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. స‌జ్జ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల కండ‌రాలు బ‌లంగా త‌యార‌వుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. పిల్ల‌ల‌కు వీటిని ఆహారంగా ఇవ్వ‌డం వారిలో జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. ఎదుగుల కూడా చ‌క్క‌గా ఉంటుంది. ఈ విధంగా మూడు ర‌కాల ధాన్యాల‌ను మ‌న ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో కూడా రాకుండా ఉంటాయి.

D

Recent Posts