Spinach : షుగ‌ర్‌, అధిక బ‌రువు, కంటి చూపు.. ఎన్నింటికో చెక్ పెడుతుంది.. త‌ర‌చూ తినాలి..!

Spinach : మ‌నం అనేక ర‌కాల ఆకుకూర‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో పాల‌కూర కూడా ఒక‌టి. దీనితో ప‌ప్పు, కూర,పాల‌క్ ప‌కోడి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూర‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. పాల‌కూరతో చేసే వంట‌కాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పాలకూర‌ను కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. ప్ర‌తిరోజూ క‌నీసం 100 గ్రాముల పాల‌కూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని వారు చెబుతున్నారు. పాల‌కూర‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. దీనిలో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె1, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, ఐర‌న్ తో పాటు 91 శాతం నీరే ఉంటుంది.

ఇది శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పాల‌కూర‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.దీనిలో ఎక్కువ‌గా నీరు, ఫైబ‌ర్ ఉంటుంది. ఇది జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌రచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. మెటాబాలిజం రేటు పెరుగుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా పాల‌కూర మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా పాల‌కూర‌ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. దీనిలో అధికంగా ఉండే నైట్రేట్స్ ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌రిచి ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి.

amazing health benefits of Spinach
Spinach

అదే విధంగా దీనిలో ఉండే ఐర‌న్ ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌పడుతుంది. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మఆరోగ్యం మెరుగుప‌డుతుంది. చ‌ర్మం బిగుతుగా త‌యార‌వుతుంది. అలాగే పాల‌కూర‌లో యాంటీ స్ట్రెస్, యాంటీ డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు కూడా ఉన్నాయ‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. వ‌య‌సు పైబ‌డే కొద్ది చాలా మంది ఎముక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. చాలా మంది నొప్పుల కార‌ణంగా స‌రిగ్గా న‌డ‌వ‌లేకపోతూ ఉంటారు కూడా. ఇటువంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉండాలంటే పాల‌కూర‌ను త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే క్యాల్షియం, విట‌మిన్ కె ఎముక‌ల‌ను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుప‌డుతుంది. కంటి సంబంధిత స‌మ‌స్య‌లు మ‌న ద‌రిచేర‌కుండా ఉంటాయి. ఈ విధంగా పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే పాల‌కూర‌ను ఎప్పుడో ఒక‌సారి తీసుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి ప్ర‌యోజ‌నాలు ఉండ‌వ‌ని దీనిని త‌ర‌చూ తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌నం ఈ ప్ర‌యోజనాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని వారు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts