Onions : మన వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో ఉల్లిపాయలు కూడా ఒకటి. మనం చేసే ప్రతి వంటలోనూ ఉల్లిపాయలను ఉపయోగిస్తూ ఉంటాం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత మనకు ఉంది. ఉల్లిలో ఉండే ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఉల్లి గొప్పతనాన్ని తెలుసుకున్న మన పెద్దలు ఉల్లిపాయను మన వంటింట్లో భాగం చేశారు. ఉల్లిపాయలలో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రో బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.
ఉల్లిపాయలలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ బి6, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, పీచు పదార్థాలు తదితర పోషకాలు ఉంటాయి. ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా టైప్2 మధుమేహం నివారించబడుతుంది. అధిక బరువుతో బాధపడే వారు ఉల్లిపాయలను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగి త్వరగా బరువు తగ్గుతారు.
ఉల్లిపాయలలో అధికంగా ఉండే సల్ఫర్ బీపీని నియంత్రణలో ఉంచడంతోపాటు రక్తం నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు, బీపీ వంటి వాటితో బాధపడుతున్న వారు రోజూ 100 గ్రా. ల వరకు ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అజీర్తి కారణంగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నప్పుడు గోరు వెచ్చని నీటిలో ఉల్లి రసాన్ని కలుపుకుని కొద్ది కొద్దిగా తాగడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది.
ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు ఉల్లిపాయను సగానికి తరిగి ఒక ముక్కను తీసుకుని వాసన చూడాలి. ఇలా చేయడంవల్ల ముక్కు నుండి రక్తం కారడం తగ్గుతుంది. అర కప్పు ఉల్లిరసంలో 3 టేబుల్ స్పూన్ల తేనెను కలిపి రోజుకు రెండు పూటలా తాగడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడంతోపాటు వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. మూత్రంలో మంటతో బాధపడుతున్న వారు రెండు తెల్ల ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి తాగడం వల్ల మూత్రంలో మంట తగ్గుతుంది.
దూదిపైన ఉల్లిపాయ రసాన్ని పిండి ఆ దూదిని చెవిలో ఉంచుకోవడం వల్ల చెవి నొప్పి తగ్గుతుంది. ఉల్లిరసంలో తేనెను కలిపి తాగడం వల్ల దగ్గుతోపాటు గొంతు సంబంధిత ఇన్ ఫెక్షన్ లు కూడా తగ్గుతాయి. ఉల్లిపాయలను ఆహారంగా తీసుకోవడంతోపాటు వాటిని మన దగ్గర ఉంచుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయకు వైరస్, బాక్టీరియా వంటి వాటిని ఆకర్షించే శక్తి ఉంటుంది. దీంతో వైరస్, బాక్టీరియాలు ఉల్లిపాయ మీదకు చేరి ఉల్లిపాయ ఘాటు కారణంగా వెంటనే చనిపోతాయి. చనిపోయిన వైరస్, బాక్టీరియాల కారణంగా ఉల్లిపాయ నల్లబడుతుంది. కనుక సగం తరిగిన ఉల్లిపాయను మరుసటి రోజు ఉపయోగించకూడదు. ఈ విధంగా ఉల్లిపాయ మనకు ఎన్నో విధాలుగా సహాయపడుతుందని, దీనిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.