Green Chilli : రోజూ మనం ఎన్నో రకాల ఆహారాలను తింటుంటాము. కూరగాయలు లేదా ఆకుకూరలతో వంటలు చేసుకుని తింటాము. వాటిలో పచ్చి మిర్చిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే కారంగా ఉంటాయని పచ్చి మిరపకాయలను ఎవరూ తినరు. కానీ నిజానికి పచ్చి మిర్చితో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి మిర్చిని రోజుకు ఒకటి చొప్పున తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పచ్చి మిరపకాయలను తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు పోతాయి. దృష్టి సరిగ్గా ఉంటుంది. చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు.
2. పచ్చి మిర్చిని తినడం వల్ల లో బీపీ ఉండేవారికి ఆ సమస్య తగ్గుతుంది. పచ్చి మిరపకాయల్లో విటమిన్ బి6, ఐరన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. లో బీపీ నుంచి బయట పడవచ్చు. అలాగే రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
3. పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకునే శక్తి పచ్చి మిర్చికి ఉంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్లు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.
4. పచ్చి మిర్చి మన గుండెకు ఎంతో మేలు చేస్తుంది. పచ్చి మిరపకాయలను రోజూ తినడం వల్ల రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ ఒక పచ్చి మిర్చిని తిన్నా చాలు.. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
5. మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా పచ్చి మిర్చి మెరుగు పరుస్తుంది. పచ్చి మిర్చిని తినడం వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది మనం తినే ఆహారంతో కలుస్తుంది. దీంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్ణ సమస్య నుంచి బయట పడవచ్చు.
6. పచ్చి మిర్చిని తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి మిరపకాయలు మేలు చేస్తాయి.
7. సైనస్ సమస్య ఉన్నవారికి పచ్చి మిరపకాయలు ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఒక మిరపకాయను తినడం వల్ల ముక్కులో ఉండే కఫం కరిగిపోతుంది. దీంతో శ్వాస సరిగ్గా ఆడుతుంది. తలనొప్పి కూడా తగ్గుతుంది.
8. డయాబెటిస్ ఉన్నవారు రోజూ పచ్చి మిరపకాయలను తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
9. పచ్చి మిర్చిని తింటే ఆకలి బాగా పెరుగుతుంది. రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. దీంతో గాయాలు అయినప్పుడు ఎక్కువ రక్తం పోకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. అలాగే కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
10. పచ్చి మిరపకాయల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల జ్వరాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం నుంచి జాగ్రత్తగా ఉండవచ్చు.
పచ్చి మిరపకాయలను రోజూ ఎలా తినాలి ? అని సందేహించేవారు.. రోజూ ఒక మిరపకాయను పెరుగన్నంలో తినవచ్చు. ఒకసారికి పూర్తిగా తినలేకపోతే.. మధ్యాహ్నం సగం, రాత్రి సగం తినవచ్చు. ఇలా తింటే పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.