Hair Fall : అస‌లు జుట్టు ఎందుకు ఊడిపోతుంది ? దీని వెనుక ఉండే కార‌ణాలు ఏమిటి ? తెలుసుకోండి..!

Hair Fall : జుట్టు ఊడిపోవ‌డం అనే స‌మ‌స్య స‌హ‌జంగానే చాలా మందికి ఉంటుంది. మ‌న శిరోజాలు రోజూ కొన్ని ఊడిపోతూనే ఉంటాయి. ఇది రోజూ జ‌రిగే చ‌ర్యనే. కానీ కొంద‌రికి మాత్రం మ‌రీ విప‌రీతంగా జుట్టు ఊడిపోతుంటుంది. అయితే దీని వెనుక ఉండే కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

what are the main reasons for Hair Fall

1. నిత్యం కాలుష్యంలో ఎక్కువ‌గా తిరిగే వారి జుట్టు ఊడిపోతుంది. లేదా కాలుష్యం ఎక్కువ‌గా ఉండే ప్రాంతంలో నివ‌సించినా జుట్టు రాలిపోతుంది.

2. త‌ల‌స్నానంకు ఉప‌యోగించే లేదా తాగేనీటి వ‌ల్ల కూడా కొంద‌రికి జుట్టు ఊడిపోతుంది.

3. కొంద‌రికి పోష‌కాల లోపం వ‌ల్ల జుట్టు సరిగ్గా పెర‌గ‌దు. పైగా ఉన్న శిరోజాలు రాలిపోతుంటాయి.

4. నిత్యం అధికంగా ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌కు గుర‌య్యేవారి జుట్టు కూడా బాగానే ఊడిపోతుంటుంది.

5. థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి జుట్టు ఊడిపోతుంది. ఇత‌ర హార్మోన్ల స‌మ‌స్య ఉన్నా కూడా ఇలాగే జ‌రుగుతుంది.

6. స‌రిగ్గా త‌ల‌స్నానం చేయ‌క‌పోయినా.. శిరోజాల‌ను బిగుతుగా ముడి వేసుకున్నా.. జుట్టు రాలిపోతుంది. కొంద‌రికి కొన్ని ర‌కాల షాంపూలు ప‌డ‌వు. అవి జుట్టు రాలేందుకు కార‌ణం అవుతాయి.

7. కొంద‌రికి వంశ పారంప‌ర్యంగా వ‌చ్చే జీన్స్ వ‌ల్ల కూడా జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంది.

క‌నుక జుట్టు రాలే స‌మ‌స్య ఉన్న‌వారు అస‌లు కార‌ణం ఎక్క‌డ ఉందో గుర్తించాలి. పైన తెలిపిన ఒక్కో కార‌ణాన్ని విశ్లేషించుకుంటూ రావాలి. అప్పుడు అస‌లు కార‌ణం ఏమిటో తెలిసిపోతుంది. దీంతో అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటే జుట్టు రాల‌డాన్ని ఆప‌వ‌చ్చు. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.

Share
Editor

Recent Posts