Onions : మన వంటింట్లో ఉండే పదార్థాల్లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత మనకు చాలా కాలం నుండి వాడుకలో ఉంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఉల్లిపాయ మనకు ఎంత మేలు చేస్తుందో. ఉల్లిపాయ లేనిదే మన వంట కూడా పూర్తి కాదు. కొందరు పచ్చి ఉల్లిపాయలను కూడా తింటూ ఉంటారు. కొందరూ సలాడ్, సాండ్ విచ్ వంటి వాటిలో కలిపి తింటారు. అసలు ఇలా పచ్చిఉల్లిపాయ తినవచ్చా.. తింటే మన శరీరంలో ఏమి జరుగుతుంది.. అన్న వివరాలను ఇప్పు తెలుసుకుందాం. ఉల్లిపాయలు మన శరీరానికి ఎటువంటి హానిని కలిగించవు. ఉల్లిపాయలు కోసేటప్పుడు ఎంజైమ్ లతో పాటు, సల్ఫర్ కూడా విడుదల అవుతుంది. దీని కారణంగా కళ్లు మండుతాయి.
కొన్ని వందల సంవత్సరాల నుండి వంటల్లో ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఉల్లిగడ్డలను విరివిరిగా సాగు చేస్తున్నారు. పచ్చి ఉల్లిపాయలను కూడా మనం నిరభ్యంతరంగా తినవచ్చు. ఇలా తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఎర్ర ఉల్లిపాయలను తినడం వల్ల శరీరంలో మంచి కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి, పీచు పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటాము.
అధిక రక్తపోటుతో బాధ పడే వారు ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఉల్లిపాయకు రక్తాన్ని పలుచగా చేసే గుణం ఉంది. దీంతో కణాలు స్వేచ్ఛగా కదిలి బీపీ, గుండె సంబంధిత సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఉల్లిపాయ రసంలో, తేనెను కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. డయేరియాతో పాటు ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లు కూడా ఈ ఉల్లిపాయలు తగ్గిస్తాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎన్నో రకాల వ్యాధుల నుండి మనల్ని కాపాడుతాయి. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల ఎముకలు కూడా ధృడంగా మారుతాయి. అలాగే జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఉల్లిపాయ మనకు ఎంతో మేలు చేస్తుంది.
వారినికి రెండు సార్లు ఉల్లిపాయ రసాన్ని మనం జుట్టుకు పట్టించి తలస్నానం చేస్తూ ఉండడం వల్ల జుట్టుకు సంబంధించిన అన్నీ రకాల సమస్యలు తగ్గుతాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా, ధృడంగా పెరుగుతుంది. మధుమేహంతో బాధపడే వారు పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇన్సులిన్ స్థాయిలను పెంచడంలో ఉల్లిపాయలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రపిండ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఉల్లిపాయలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
రోజూ ఉదయం పెరుగులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తినడం వల్ల మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు మంచి ఫలితాలను పొందవచ్చు. 6 లేదా 7 గ్రాముల ఉల్లిపాయను ముక్కలుగా చేసి ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మూత్రంలో మంట, మూత్రం లో వేడి, మూత్రం విసర్జించేటప్పుడు నొప్పి రావడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఉల్లిరసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య కూడాపెరుగుతుంది. తెల్ల ఉల్లిపాయను పేస్ట్ గా చేసి వెన్నతో వేయించి పరగడుపున తినాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో కూడా ఉల్లిపాయ మనకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని, ఆలివ్ నూనెను సమపాళ్లల్లో తీసుకుని ముఖానికి పట్టిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలు వంటి సమస్యలు తగ్గుతాయి. కాలిన గాయాలపై, తేనెటీగ, తేలు కుట్టిన చోట ఉల్లిపాయ రసాన్ని రాయడం వల్ల గాయాలతో పాటు, మంట, నొప్పి కూడా తగ్గుతుంది. దంతాల సమస్యలతో బాధపడే వారు పచ్చి ఉల్లిపాయను రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా నమిలి మింగడం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్లయన్నీ తగ్గుతాయి. ఈవిధంగా ఉల్లిపాయ మనకు ఎంతో మేలు చేస్తుందని పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.