కూర‌గాయ‌లు

Ponnaganti Kura : ఈ ఆకుకూర‌ను తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా.. న‌మ్మ‌లేరు..!

Ponnaganti Kura : అమరాంథేసి కుటుంబానికి చెందిన పొన్నగంటి కూర సంవత్సరం పొడవునా లభ్యం అవుతుంది. ఈ కూర పొలాల గట్ల వెంట ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. పొన్నగంటి కూరలో ఎన్నో ఆరోగ్యకర‌మైన‌ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ ఆకుకూరలో బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకుకూరను పప్పుగా చేసుకోవచ్చు. అలాగే సలాడ్స్ లో కూడా వేసుకోవచ్చు. ఈ ఆకు కూరను ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు. మోకాళ్ల‌ నొప్పులు ఉన్నవారు వారంలో మూడుసార్లు ఈ కూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఈ కూర ప్రస్తుతం అన్ని ఆకుకూరల లాగానే విరివిగా లభ్యమవుతోంది. ఈ ఆకును శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడిగా తయారు చేసుకుని అన్నంలో కలుపుకుని తినవచ్చు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. తల నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకుకూరను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు. మన‌కు ప్రకృతిలో లభించే అన్ని ఆకుకూరలు మనకు ఏదో రకంగా ప్రయోజనాలను కలిగిస్తాయి. కాబట్టి మిస్ కాకుండా తినడానికి ప్రయత్నం చేయండి. కంటి చూపు పెరుగుదలకు కూడా చాలా బాగా సహాయపడుతుంది. మన అమ్మమ్మలు నానమ్మలు వారి కాలంలో ఎక్కువగా ఈ ఆకుకూరను తినేవారు.

many wonderful health benefits of Ponnaganti Kura

ఈ ఆకును మెత్తని పేస్ట్ గా చేసి ముఖానికి రాస్తే మొటిమలు, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది. పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క‌నుక ఈ ఆకుకూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts