Snake Gourd : రుచి నచ్చదని మీరు పొట్లకాయలను తినడం లేదా.. అయితే ఈ లాభాలను కోల్పోతున్నట్లే..!

Snake Gourd : మనకు తినేందుకు అనేక కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని రకాల కూరగాయలను మాత్రం రుచిగా ఉండవని చెప్పి చాలా మంది తినరు. వాస్తవానికి అలాంటి కూరగాయల్లోనే అధికంగా పోషకాలు ఉంటాయి. ఇక అలాంటి కూరగాయల్లో పొట్లకాయలు కూడా ఒకటి. ఇవి మనకు మార్కెట్‌లో దాదాపుగా ఏడాది పొడవునా లభిస్తాయి. కానీ చాలా మంది వీటిని తినరు. రుచి బాగుండదని చెప్పి ఎవరూ వీటి జోలికి కూడా వెళ్లరు. అయితే వాస్తవానికి పొట్లకాయలు మనకు ఎంతగానో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. పొట్లకాయలను తినకపోతే అనేక లాభాలను కోల్పోతామని అంటున్నారు. పొట్లకాయలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పొట్లకాయలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా సీజనల్‌ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే క్యాన్సర్‌ రాకుండా నిరోధించే గుణాలు కూడా వీటిల్లో ఉన్నాయి. ఇక పొట్లకాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలు ఉండవు. ముఖ్యంగా ఆర్థరైటిస్‌, గౌట్‌ వంటి సమస్యలు ఉన్నవారు ఈ కాయలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Snake Gourd amazing health benefits do not forget to take them
Snake Gourd

జ్వరం వచ్చిన వారు, కామెర్లు అయిన వారు ఈ కాయలను తింటుంటే త్వరగా కోలుకుంటారు. అలాగే గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఈ కాయలు ఎంతో మంచివి. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే కాల్షియం అధికంగా ఉంటుంది కనుక ఎముకలు దృఢంగా మారుతాయి. పొట్లకాయలలో ఫైటోన్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జ్వరాన్ని తగ్గించగలవు. జ్వరం వచ్చిన వారు ఈ కాయలను తింటే త్వరగా జ్వరం తగ్గుతుంది. అలాగే పొట్లకాయ ఆకులను శరీరంపై రుద్దుతుండాలి. దీంతో కూడా జ్వరం తగ్గుతుంది. అలాగే ఈ కాయలను తినడం వల్ల నీరసం, అలసట ఉండవు.

ఈ కాయలను తినడం వల్ల కుకుర్బిటాసిన్‌ అనే సమ్మేళనాలు శరీరానికి లభిస్తాయి. ఇవి రక్షణ వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. లివర్‌ పనితీరును మెరుగు పరుస్తాయి. దీంతో కామెర్లు తగ్గుతాయి. వీటిని ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల కామెర్లు త్వరగా నయం అవుతాయి. చాలా మంది గుండె దడ, ఛాతి నొప్పి, హైబీపీ, ఇతర గుండె సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు రోజూ 30 ఎంఎల్‌ మోతాదులో అయినా సరే పొట్లకాయ రసం తాగుతుండాలి. దీంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. హైబీపీ తగ్గుతుంది. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

పొట్లకాయలను ముక్కలుగా కట్‌ చేసి వాటిని మిక్సీలో వేసి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాయాలి. కాసేపయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాలకు పోషణ లభిస్తుంది. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు, ఇతర జుట్టు సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు ఉండడం వల్ల కీళ్ల వ్యాధులు సైతం నయం అవుతాయి. ఇది వృద్ధులకు ఎంతగానో మేలు చేసే అంశం. అలాగే ఈ కాయలను తింటే థైరాయిడ్‌ గ్రంధి పనితీరు మెరుగు పడుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. టెన్షన్స్‌, ఒత్తిడి, డిప్రెషన్‌ ఉండవు. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి ఉండదు. ఇలా పొట్లకాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని తరచూ తీసుకోవడం మరిచిపోకండి.

Share
Editor

Recent Posts