Capsicum : మనం వంటింట్లో ఉపయోగించే కూరగాయల్లో క్యాప్సికం ఒకటి. ఈ క్యాప్సికాన్ని బెల్ పెప్పర్, సిమ్లా మిర్చి, పెద్ద మిరప, బెంగుళూరు మిర్చి వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. క్యాప్సికంలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. మనకు ఎక్కువగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ తదితర రంగుల్లో క్యాప్సికం లభిస్తుంది. వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ క్యాప్సికం సులువుగా పెరుగుతుంది. తరచూ క్యాప్సికాన్ని ఆహారంలో భాగంగా వాడడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
వీటిల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె లతోపాటు పీచు పదార్థాలు, కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా కంటి చూపును మెరుగుపరచడంలో కూడా క్యాప్సికం ఉపయోగపడుతుంది. కంటిలో శ్లుకాలు ఏర్పడకుండా చేయడంలో క్యాప్సికం సహాయపడుతుంది.
శరీరంలో మెటబాలిజాన్ని పెంచుతుంది. శరీరంలో చెడు కొలెస్త్రాల్ స్థాయిలను తగ్గించి బరువు తగ్గడంలో క్యాప్సికం దోహదపడుతుంది. క్యాప్సికాన్ని తరుచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు సమస్యలను తగ్గించి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో క్యాప్సికం ఉపయోగపడుతుంది.
ముక్కు నుండి రక్తం కారడం వంటి సమస్యలను తగ్గించడంలో క్యాప్సికం ఎంతో సహాయపడుతుంది. తరచూ క్యాప్సికాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గడంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. హైబీపీని కూడా క్యాప్సికం తగ్గిస్తుంది. తరచూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే వారు క్యాప్సికాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు. శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలోనూ క్యాప్సికం దోహదపడుతుంది.
గొంతు నొప్పి, గొంతు బొంగురు పోవడం వంటి సమస్యలతో బాధపడే వారు క్యాప్సికం జ్యూస్ ను గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. కనుక క్యాప్సికాన్ని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీన్ని రోజూ నేరుగా అలాగే పచ్చిగానే తినవచ్చు. లేదా జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు. దీంతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.