Weight Gain Diet : ఎంత స‌న్న‌గా ఉండేవారు అయినా స‌రే.. వీటిని తీసుకుంటే కండ‌ప‌ట్టి పుష్టిగా త‌యార‌వుతారు..

Weight Gain Diet : అధిక బ‌రువు వ‌ల్ల మ‌నం ఎలాగైతే ఇబ్బందుల‌ను ఎదుర్కొంటామో బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. ప్ర‌తి ఒక్క‌రు త‌గినంత బ‌రువు ఉండ‌డం చాలా అవ‌స‌రం. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త‌, నీర‌సం, అల‌స‌ట‌, రోజంతా ఉత్సాహంగా లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. క‌నుక మ‌నం ఖ‌చ్చితంగా వ‌య‌సుకు త‌గినంత బ‌రువు ఉండాలి. అయితే త‌గినంత బ‌రువు ఉండ‌డం వేరు. లావ‌వ‌డం వేరు. చాలా మంది బ‌రువు పెర‌గ‌డానికి జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. దీంతో వారు లావుగా అయ్యి బ‌రువు పెరిగిన‌ప్ప‌టికి వారి శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

క‌నుక మ‌నం ఆరోగ్య వంతంగా బ‌రువు పెర‌గ‌డం చాలా ముఖ్యం. ఆరోగ్యవంతంగా బ‌రువు ఎలా పెర‌గాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వంశ‌పార‌ప‌ర్యంగా స‌న్న‌గా ఉండే వారు కొంద‌రైతే, పోష‌కాహార లోపం వ‌ల్ల, థైరాయిడ్ కార‌ణంగా స‌న్న‌గా ఉండే వారు మ‌రికొంద‌రు. అలాగే కొంద‌రు ఎటువంటి ఆహారాన్ని తీసుకున్న‌ప్ప‌టికి దానిలోని పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా స‌న్న‌గా, బ‌రువు త‌క్కువ‌గా ఉంటారు. బ‌రువు త‌క్కువ‌గా, స‌న్న‌గా ఉన్న‌వారు ఈ చ‌క్క‌టి డైట్ పద్ద‌తిని పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. ఆరోగ్య‌క‌ర‌మైన వ్య‌క్తి రోజుకు రెండు వేల క్యాల‌రీలు అవ‌స‌ర‌మ‌వుతాయి.

Weight Gain Diet take these daily for healthy body
Weight Gain Diet

బ‌రువు పెర‌గాల‌నుకునే వారు శ‌రీరానికి అంత కంటే ఎక్కువ క్యాల‌రీల‌ను అందించాలి. మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ప్రోటీన్ స్మూతీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి ఎక్కువ క్యాల‌రీల‌ను ఆరోగ్యక‌రంగా అందించే ప‌దార్థాల్లో ముఖ్య‌మైన‌ది అర‌టి పండు. బాగా పండి మ‌చ్చ‌లు ఉన్న అరటి పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ ఉద‌యం ఒక గ్లాస్ పాల‌ల్లో రెండు అర‌టి పండ్ల‌ను వేసి స్మూతీలాగా త‌యారు చేసుకోవాలి. అలాగే ఈ పాల‌ల్లో అర‌టి పండ్ల‌తో పాటు రాత్రంతా నాన‌బెట్టిన 10 లేదా 15 ఎండు ద్రాక్ష పండ్ల‌ను వేసి స్మూతీ లాగా త‌యారు చేసుకోవాలి. నాన‌బెట్టిన ఎండు ద్రాక్ష పండ్లు శ‌రీర బ‌రువును పెంచ‌డంలో ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ఇలా త‌యారు చేసుకున్న స్మూతీని ఉద‌యం మ‌రియు సాయంత్రం తీసుకోవ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. ఈ స్మూతీని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే బ‌ల‌హీన‌త‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. శ‌రీరంలో నీర‌సం, నిస్స‌త్తువ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల కండ‌రాలు కూడా బ‌లంగా త‌యార‌వుతాయి. స్త్రీలు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల నెల‌సరి స‌మ‌స్యలు కూడా తొల‌గిపోతాయి. ఈ స్మూతీని తాగ‌డం వల్ల బ‌రువు పెర‌గ‌డంతో పాటు ఆరోగ్యంగా కూడా త‌యార‌వుతార‌ని నిపుణులు చెబుతున్నారు. బ‌రువు పెర‌గాల‌నుకునే వారు ఈ స్మూతీని తీసుకుంటేనే రోజూ గుప్పెడు నాన‌బెట్టిన నల్ల శ‌న‌గ‌ల‌ను తీసుకోవాలి.

 

శ‌న‌గ‌ల‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవస‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గిన‌న్ని ప్రోటీన్లు ల‌భించి త్వ‌ర‌గా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. శ‌న‌గ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అలాగే బ‌రువు పెర‌గాల‌నుకునే త‌క్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువ‌సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల తీసుకున్న ఆహారం చ‌క్క‌గా శ‌రీరానికి ప‌డుతుంది. బ‌రువు పెర‌గాల‌నుకునే వారు, స‌న్న‌గా ఉన్న వారు ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఆరోగ్య‌వంతంగా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు.

D

Recent Posts