Thotakura Vepudu : తోట‌కూర వేపుడును ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..

Thotakura Vepudu : మ‌నం ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని ఆకుకూర‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం తినే ఆకుకూర‌ల్లో తోట‌కూర ఒక‌టి. తోట‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుపడుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ తోట‌కూర‌తో ఎక్కువ‌గా మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. అన్నంతో క‌లిపి తింటే తోట‌కూర వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఈ తోట‌కూర వేపుడును మ‌రింత రుచిగా అలాగే దీనిలో ఉండే పోష‌కాలు ఆవిరై పోకుండా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తోట‌కూర వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన తోట‌కూర – 5 క‌ట్ట‌లు ( మ‌ధ్య‌స్థంగా ఉన్నవి), ఎండుమిర్చి – 6 లేదా కారానికి త‌గిన‌న్ని, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, స‌న్న‌గా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 1, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ప‌సుపు – అర క‌ప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Thotakura Vepudu  recipe in telugu wonderful taste cook in this way
Thotakura Vepudu

తోట‌కూర వేపుడు త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ఎండుమిర్చి, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ తోట‌కూర‌ను ఆవిరి మీద 10 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. ఇలా ఉడికించ‌డం వ‌ల్ల తోట‌కూర రుచిగా ఉండ‌డంతో పాటు దానిలోని పోష‌కాలు కూడా పోకుండా ఉంటాయి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించుకోవాలి. త‌రువాత ఉడికించిన తోట‌కూర‌, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిని 5 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టిన ఎండుమిర్చి పొడిని వేసి క‌ల‌పాలి.

దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తోట‌కూర వేపుడు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే తోట‌కూర వేపుడు కంటే ఈ విధంగా చేసిన తోట‌కూర వేపుడు మరింత రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. తోట‌కూర‌ను ఈ విధంగా వేపుడును త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పొంద‌వ‌చ్చు.

D

Recent Posts