Off Beat

క‌రాచీ బేక‌రీకి ఆ పేరు ఎలా వ‌చ్చిందో మీకు తెలుసా..?

కరాచీ బేకరి…తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న పేరు. ముఖ్యంగా హైదరాబాద్‌ మహా నగరంలో ఉన్న వారు ఎక్కువగా కరాచీ బేకరీకి వెళతారు. అసలు ఆ బేకరికీ కరాచీ అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. 1947 లో భారత విభజన జరిగినప్పుడు కరాచీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌ కు వలస వచ్చిన సిందీ వలస దారుడు కాంచద్‌ రాంనాని ఈ బేకరీని స్థాపించాడు. రాంనాని కరాచీ నుంచి వలస రావడంతో కరాచీ పేరు మీదనే బేకరీని స్థాపించారు.

1953 లో మొహంజాహి మార్కెట్‌ లో హైదరాబాద్‌ లో మొదటి కరాచీ బేకరీ ప్రారంభం అయింది. 2019 పుల్వామా దాడితో.. పాకిస్థాన్‌ మీద పెరిగిన వ్యతిరేకత సెగలు కరాచీ బేకరీకి కూడా తగిలాయి. కరాచీ బేకరీ పేరు పాకిస్థాన్‌ లోని ప్రధాన నగరం పేరు ఒకటే కావడంతో.. దాని పేరు భారతీయ కరాచీ బేకరీగా మార్చాలని నినాదాలు వచ్చాయి. వాటిని చల్లార్చడానికి బేకరీల ముందు జాతీయ జెండాను ఎగురవేసి దేశ భక్తి.. చాటుకున్నారు బేకరీ యాజమాన్యం.

do you know how karachi bakery got that name

కరాచీ అనే పేరు తమ బేకరీకి వారసత్వంగా వచ్చిందని.. అది పాకిస్థాన్‌ కు సానుభూతి కాదని.. విభజన సమయంలో పాకిస్థాన్‌ లో చెలరేగిన హింస వల్ల తాము ఇక్కడికి వచ్చి ఈ వ్యాపారం ఏర్పాటు చేసుకున్నామని.. ఈ పేరు పెట్టడం భారత్‌ కు వ్యతిరేకం కాదని వెల్లడించారు. పేరు మార్చే ఉద్దేశం లేదని.. యాజమాన్యం పేర్కొంది. కేవల్ ఒక్క హైదరాబాద్‌ లోనే ఇవి 23 బ్రాంచ్‌ లున్నాయి. దీంతో పాటు దేశంలో మరొక 10 చోట్ల కరాచీ బేకరీ ప్రసిద్ది చెందింది.

Admin

Recent Posts