హనీమూన్ మొదటి రోజు .. ఆమె..డ్రింక్ చేస్తుంటే… ఆశ్చర్యం అతని వంతు అయింది… ఆమె త్రాగేసి……నీకు అలవాటు లేకపోవటం.. నా ఖర్మ అంటూ సిగరెట్ ముట్టించింది…..పొగలు వదులుతూ….విలాసంగా.. ఆమె వేష ధారణ అర్ధ నగ్నం గా అతనికి ఇబ్బంది కరంగా ఉన్నది..(ఇంటి స్త్రీ లా లేదు..) మార్చుకొమ్మంటే…. అదే తన ఇష్టం, అలవాటు అన్నది… ప్రక్క రూమ్ వారితో…పబ్ కి వెళ్లి డాన్స్ చేసోద్దాం..అడిగింది ఆమె. .. అతను నాకు నచ్చదు..రాలేను.. అన్నాడు. ఆమె వారితో వెళ్లి పోయి..తన ఎంజాయ్ మెంట్ కానిచ్చుకొని.. తెల్లారి తూలుతూ వచ్చి నిద్ర పోయింది. .ఆమెకు మెలకువ వచ్చాక…అతను అడిగాడు.. తన చిరాకు దాచుకుంటూ… ఇవన్నీ మన పెళ్లి ముందు చెప్పలేదు?
నాకు ఇంత అతి సోషల్..ఈ డ్రింక్స్, డ్రగ్స్…pubs అస్సలు నచ్చవు… నేను కావాలంటే..నాతో ఉండాలంటే.. ఇవన్నీ.. మానేయాలి..అపుడే కలిసి ఉండగలం..అని చెప్పాడు. దానికి ఆమె…ఇవి చెప్పాల్సిన అవసరం నాకు అపుడు అనిపించ లేదు. అంత పెద్ద కార్పొరేట్ కంపెనీలో పెద్ద పోస్ట్…లో ఉంటే… ఈ కాలం మనిషివి అనుకున్నా….నా ఖర్మ….దరిద్రం.. నువు రాముడి వి , మడి మనిషివి ముసలి చాదస్తుడివి.పప్పు సుద్దవి. .అని ఇపుడే తెలిసింది…కాదు అర్ధం అయింది..విసుగుతో జవాబిచ్చింది..
ఐనా చెప్పాల్సిన అవసరం ఏముంది… ఇవి చాలా మామూలు విషయాలు …. నాగరికత తెలియని పల్లెటూరి బైతువి. ..పిచ్చోడివి.ఈ రోజుల్లోకూడా నీలాంటి culture less ఉన్నారు.. నా.ఖర్మ కొద్దీ నాకే తగిలావు ఛీ ఛీ..తిట్టుకుంటోంది.ఆమె. .ఇంతలో చివ్వున లేచింది …నీలాంటి డౌన్ మార్కెట్ నాకు వద్దు…. నీతో…కలిసి బ్రతకలేను..నిస్సారంగా, పతివ్రతలా..గడప చాటు చాదస్తపు ఇల్లాలిలా… మడి కట్టుకుని.. వద్దే వద్దు. నాకు నచ్చిన సోషల్ లైఫ్ నాకు కావాలి. అదే ఆనందం.నా లైఫ్ స్టైల్ అంతే.. నా బ్రతుకు నీలా ధ్వంసం చేసుకోలేను.. ఆమె సూట్కేస్ తీసుకుని… బై చెప్తూ.. నిండు జీవితం ..అతనికి చీకటి చేసేసి వెను తిరిగి చూడక .. విస విసా వెళ్లి పోయింది…
అతని తప్పు లేకుండా… ఇపుడు డివోర్సీ టాగ్ తెచ్చుకున్నాడు.. భరణం క్రింద దొంగ కేస్ బనాయించి, డబ్బు బాగా గుంజి..అతని జీవితం .వీలైనంత తగలెట్టి…తను జారుకుంది.. ఇపుడు మరో కొత్త ఎర వేస్తోంది…. జీవితాలు కూల్చే విష కన్య లా ఆ బరితెగించిన నెరజాణ.