Off Beat

రానున్న సంవత్సరాల్లో ఏం జరగబోతుందో తెలుసా.? స్టీఫెన్ హాకింగ్ చెప్పిన 5 షాకింగ్ నిజాలు ఇవే..!

స్టీఫెన్‌ హాకింగ్‌.. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త.. ఐన్‌స్టీన్‌ తరువాత అంతటి ప్రముఖ సైంటిస్టుగా పేరుగాంచిన ఏకైక వ్యక్తి ఈయన. యువకుడిగా ఉన్నప్పటి నుంచి చివరి శ్వాస విడిచే వరకు వీల్‌ చెయిర్‌కే ఈయన పరిమితమయ్యారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అనేక అంశాలపై పరిశోధనలు చేశారు. పుస్తకాలు రాశారు. గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని, అనేక విషయాలను ఆయన మనకు తెలియజేశారు. అయితే స్టీఫెన్‌ హాకింగ్‌ రానున్న కాలంలో మన భూమి, విశ్వం, ప్రపంచం ఏమవుతుందో ముందుగానే ఊహించి పలు విషయాలను కూడా మనకు తెలియజేశారు. మరి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా. రానున్న సంవత్సరాల్లో.. అంటే.. 2600వ సంవత్సరం నాటికి భూమి అగ్నిగుండంలా మారుతుందట. అంతరిక్షం నుంచి చూస్తే ఫైర్‌ బాల్‌ (అగ్ని బంతి) లా కనిపిస్తుందట. రోజు రోజుకీ పెరిగిపోయే జనాభా, సహజ వనరులు అంతరించిపోవడం వంటి కారణాల వల్ల ఇలా జరుగుతుందట.

వచ్చే 100 సంవత్సరాల కాలంలో భూమిపై ఉన్న మనుషులు వేరే గ్రహాన్ని నివాసం కోసం చూసుకోవాలట. లేకపోతే భూమిపై అసలు నివాసయోగ్యంగా ఉండదట. ఇక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కారణంగా మనుషుల పతనం ఆరంభమవుతుందట. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మానవాళికి వినాశనాన్ని కలగజేస్తుందట. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా రాబోయే సంవత్సరాల్లో భూమిపై సగటు ఉష్ణోగ్రతలు 250 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంటుందట. అంతరిక్షంలో వేరే గ్రహాలపై ఉండే ఏలియన్స్‌ భూమిపైకి వస్తాయట. గ్రహాంతర వాసులు భూమిపైకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న సహజ వనరులను తమ గ్రహానికి తరలించుకుపోతారట. ఇక్కడ ఉండే మనుషులను చంపేస్తారట.

what stephen hawking told about word ending

రాబోయే కాలంలో దేశాల మధ్య అణు యుద్ధాలు జరిగి దాదాపు చాలా వరకు మానవాళి తుడిచిపెట్టుకుపోతుందట. భూమిపై అసలు జీవం అనేది కనిపించదట. ఇవన్నీ స్టీఫెన్‌ హాకింగ్‌ ముందే ఊహించి చెప్పారు. మరి ఇవన్నీ నిజమవుతాయా ? అంటే.. ఏమో.. మనం అప్పటి వరకు అయితే ఉండం కదా. కానీ మన భవిష్యత్‌ తరాల వారు తెలుసుకుంటారు కదా.

Admin