వినోదం

వాల్తేరు వీరయ్య లో డైలాగ్ అక్కడ నుండి లేపేసారా..? ఇది అస్సలు ఊహించి ఉండరు..

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి ఊర మాస్ లుక్ లో కనిపించారు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను మాత్రం అందుకోలేక‌పోయింద‌నే చెప్పాలి. మూవీ యావ‌రేజ్ టాక్‌ను ద‌క్కించుకుంది.

పూనకాలు లోడింగ్.. పూనకాలు లోడింగ్.. అంటూ దర్శకుడు బాబి సినిమా రిలీజ్‌కు ముందు చెప్పారు. కానీ మూవీ అంత‌గా ఆక‌ట్టుకోలేదు. అయితే మాస్ డైలాగ్స్ తో చిరంజీవి త‌న అభిమానులను మెప్పించారు. మెగాస్టార్ మార్క్ యాక్షన్, రొమాన్స్, మాస్ స్టెప్పులు, పవర్ఫుల్ డైలాగ్స్ ఈ మూవీలో ఆక‌ట్టుకున్నాయి. అయితే ఈ మూవీకి చెందిన ఓ విష‌యం ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ముఖ్యంగా సినిమాలోని ఓ డైలాగ్‌ను మ‌రో మెగా హీరో మూవీ లోంచి కాపీ కొట్టార‌ని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

this dialogue from valthair veerayya is copied from that movie this dialogue from valthair veerayya is copied from that movie

అది మరే సినిమానో కాదు.. 2017లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరో గా తెరకెక్కిన విన్నర్. ఈ చిత్రంలో ఓ పోలీస్ క్యారెక్టర్ లో నటించారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్. ఈ చిత్రంలో పృధ్విరాజ్ నటించిన పోలీస్ క్యారెక్టర్ పేరు సింగం సుజాత. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు సింగం సుజాత ఓ డైలాగ్ చెబుతారు. రికార్డ్స్ లో నా పేరు ఉండడమేంట్రా.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. సుజాత.. సింగం సుజాత.. అని పవర్ ఫుల్ డైలాగ్ చెబుతారు. ఈ డైలాగ్ ని వాల్తేరు వీరయ్యలో చిరంజీవి చెప్పడంతో ఈ డైలాగ్ ని అక్కడి నుండే లేపేసారని ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.

Admin

Recent Posts