వినోదం

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన జాక్ మూవీ ఎలా ఉంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">యువ హీరో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు&comma; టిల్లు స్క్వేర్ చిత్రాలతో వరుసగా సూపర్ హిట్స్ అందుకొని టాలీవుడ్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు&period; ముఖ్యంగా యువతలో సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది&period; ఈ నేపథ్యంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సిద్దు తాజా చిత్రం జాక్ ఏప్రిల్ 10à°¨ ప్రేక్షకుల ముందుకు వచ్చింది&period; స్పై యాక్షన్ కామెడీగా రూపొందిన జాక్ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ పాత్ర ఆసక్తికరంగానే ఉన్నా&comma; కథ&comma; స్క్రీన్‌ప్లే విషయాల్లో మాత్రం పూర్తిగా నిరాశపరిచింది&period; ఫస్ట్ హాఫ్ అంతా గందరగోళంగా ఉండటం వల్ల ప్రేక్షకులకు ఎంగేజింగ్ అనిపించలేదు&period; స్పై సీన్లు&comma; విలన్ సన్నివేశాలు ప్రేక్షకులను బోర్ చేశాయి&period; స్క్రీన్ ప్లే లో స్పష్టత లేకపోవడంతో సినిమా గ్రిప్ కోల్పోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య సిద్దుకు జోడీగా నటించింది&period; కానీ వారిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరించలేకపోయాయి&period; ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చాలా నిరాశపరిచాయి&period; సినిమాలో కామెడీ&comma; యాక్షన్ రెండూ వర్కౌట్ కాలేదనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి&period; సిద్దు జొన్నలగడ్డ తన స్టైల్ కామెడీతో ప్రయత్నించినా&comma; స్క్రీన్‌ప్లే సరిగ్గా లేకపోవడం వల్ల అతడి ప్రయత్నం ఫలించలేదు&period; కొన్ని వన్ లైనర్స్ మినహా సినిమా అంతా ఫ్లాట్ గా సాగిపోయింది&period; బొమ్మరిల్లు&comma; పరుగు లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ మరోసారి తన దర్శకత్వంతో నిరాశపరిచాడు&period; కామెడీ&comma; యాక్షన్&comma; దేశభక్తి&comma; మదర్ సెంటిమెంట్ ఇలా ప్రతీ అంశాన్ని ప్రయత్నించినా&comma; ఏదీ ప్రేక్షకుల మనసుకు హత్తుకోలేదు&period; ఈ చిత్రం ద్వారా తిరిగి తన కెరీర్ ను నిలబెట్టుకునే అవకాశం వృథా చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82769 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;jack-movie&period;jpg" alt&equals;"how is jack movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అచ్చు రాజమణి అందించిన సంగీతం&comma; బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏమాత్రం ఆకట్టుకోలేదు&period; ఈ అంశం కూడా సినిమాకు పెద్ద మైనస్ గా నిలిచింది&period; పాటలు&comma; బీజియం రెండూ ప్రేక్షకులను నిరాశపరిచాయి&period; ఈ సినిమాకు ఏదైనా పాజిటివ్ ఉందంటే అది కేవలం సిద్దు పండించిన కొన్ని కామెడీ సీన్లే అని ప్రేక్షకుల అభిప్రాయం&period; రెండు భారీ విజయాల తర్వాత జాక్ తో సిద్దు జొన్నలగడ్డ కెరీర్‌లో స్పీడ్ బ్రేకర్ పడిందని చెబుతున్నారు&period; మొత్తంగా జాక్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది&period; ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts