Off Beat

ల‌లిత జ్యువెల్ల‌రీలో బంగారాన్ని త‌క్కువకే ఎలా ఇస్తారు..?

లలితా జ్యువెలరీ యజమాని పదే పదే తన షాపులోని బంగారు ఆభరణాల ధరతో ఇతర షాపుల్లోని ఆభరణాల ధరను పోల్చిచూడమని ధైర్యంగా చెప్తున్నారు. అయితే ఇతర జ్యువెలరీ షాపుల వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారా? లేకుంటే ఆయనకు బదులుగా సరైన ప్రకటనలు ఎందుకు ఇవ్వరు? లలితా జ్యువలరీ ఆయన చెప్పేది నిజమే, వేరే షాపుల కంటే లలితా లో చాలా తక్కువ తరుగు/తయారీ వుంటున్నాయి, అది నిజమే, కానీ అందులో దాగిన అబద్దం ఏమిటంటే ఈ నిజం అన్నీ వస్తువులకు వర్తించట్లేదు. నేను 50గ్రాముల గాజులు కొన్నాను, కేవలం 3% తరుగు+తయారీ వేశారు, అంతా తక్కువ నేను ఎక్కడ చూడలేదు వినలేదు, లలితాలోనే కొన్నాను, మరొకసారి ఉంగరం కొన్నాను, అది కూడా చాలా పాత డిజైన్ చాలా సాధారణ డిజైన్, 16% వేశారు, మంచి డిజైన్ లు ఉండే వాళ్ళు కూడా 12–14% వేస్తారు ఈ ఉంగరం ఏమో 16% వేశాడు లలితాలో, అలాగే మరొక దండ కొంటే అలాగే జరిగింది.

కాబట్టి వాళ్ళ దగ్గర కొన్ని రకాల వస్తువులు అతి తక్కువ తరుగుతో ఉన్నాయి, కేవలం కొన్ని మాత్రమే. బంగారు నాణ్యత – నేను వాళ్ళ షోరూం లోనే క్వాలిటీ చెక్ చేశాను, వాళ్ళ దగ్గర కొన్న ఏ వస్తువూ 916 రాలేదు, ఒకసారి 902, మరోసారి తిప్పి చెక్ చేస్తే 910, ఇలా వస్తువును తిప్పి తిప్పి టెస్ట్ చేస్తే ఏదో ఒకసారి 915 వచ్చింది, 22 కారెట్లు అంటే 1000 వంతుల్లో 916 వంతులు బంగారు ఉండాలి, కనీసం 916 అని, 916 కంటే తగ్గితే దానికి 22 కారెట్ల విలువ రాదు, కావాలంటే మీరు మీ పాత బంగారు లలితా లోనే అమ్మి చూడండి 916 రాకపోతే 22 కరెట్ల రేటు ఇవ్వము అని చెప్పేస్తారు, వారి వస్తువులు 916 లేకపోయినా 22 కారెట్ల‌ రేటు వసూలు చేస్తారు. నేను తనిష్క్ అనే టాటా వారి షాప్ లో కొంటుంటా, మలబార్ లో కూడా, అక్కడ కొన్న ఏ వస్తువూ నాకు ఇప్పటి వరకూ 920 తక్కువ రాలేదు.

why gold is cheaper in lalita jewellers

ఒకసారి ఐతే ఎవరో కమ్మలు కొని చూస్కుంటే వారికి 940 వచ్చింది తనిష్క్ లో, కానీ 916 రేటు నే, ఇదేదో టాటా వాళ్ళ టెస్టింగ్ లో అలా అనుకోవద్దు, నేను రకరకాల షాపుల్లో చెక్ చేస్తూ ఉంటాను, అలా గమనించిన స్వానుభవాలే రాస్తున్నా, ఊరికే ఒకసారి వాళ్ళని అడిగి చూడండి మీ పాత బంగారు ఏ రేటుకి తీసుకుంటారో, ఒకసారి అడగండి మీకే తెలుస్తుంది, 916 కంటే తగ్గితే సుమారుగా 4–8% తగ్గించుతారు మీ వస్తువు విలువని, hallmark undi అనుకోకండి, మీరిచ్చిన డబ్బు వాళ్ళు లెక్కపెట్టి తీసుకుంటారు కదా, మరీ వాళ్ళిచ్చిన బంగారు నాణ్యత మీరు చూసుకోవాలి కదా,ప్రతి షాప్ లోనూ క్యారెట్ మీటర్స్ ఉన్నాయి, చూసుకోండి, 916 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, మీరు ఆ నగలో కలిపిన రాగి/వెండి కి కూడా బంగారు రేటు ఇస్తున్నట్టే.

వెండి నాణ్యత – ఇక్కడ చాలా తెలివి ప్రదర్శిస్తున్నారు, సహజం గా వెండి వస్తువులు అంటే 92.5 స్వచ్ఛత కలిగి ఉండాలి, అంటే ఇపుడు బంగారు 22 కారేట్లు అంటే 1000 లో 916 వంతులు అన్నట్టు, వెండిలో 1000 లో 925 వంతులు ఉండాలి, ఇలా 92.5 ఉన్న వెండి వస్తువులు కొన్నప్పుడు వెండి రేటు కాకుండా తయారీ అని అదనపు చార్జీ వేస్తారు, అంటే మీరు 100 గ్రాముల వెండి వస్తువు కొంటే, 100*75= 7500 కానీ మీకు అది సుమారుగా 8500 పడుతుంది, అంటే అదనం గా గ్రాముకి 10 లెక్కన 1000, ఇది వాళ్ళ తయారీ తరుగు అంటారు, ఒకరకం గా ఇది నిజమే వాళ్ళకి చేసిన ఖర్చు ఉంటుందిగా అని, కానీ లలితాల చాలా వరకూ తరుగు ఉండదు గ్రాము రేటు ఇచి వస్తువు తీసుకెళ్లండి అంటారు.

అంటే ఇదే 100 గ్రాముల వస్తువు మీకు లలితా లో 7500 కే ఇచ్చేస్తారు, ఎలాగ అంటే ఆ వస్తువులో 92.5 వంతులు వెండి ఉండదు, 80–85 ఉంటుంది, అసలు ఎంత ఉందో చెప్పరు, మనకు కావాలని మనమే అడిగితే మెషీన్ లో చెక్ చేస్తారు అది కూడా చాలా నసిగి, చెక్ చేశాక నిజం తెలుస్తుంది, మీరేమో ఒక గ్రాము వెండి రేటు ఇస్తారు కానీ అందులో నిజానికి 800–850 మిల్లీ గ్రాముల వెండి మాత్రమే ఉంటుంది, అర్దం అయిందా? 92.5 వెండి ఉండాలి, మలబార్ లో వెండి కొన్నాను, దాని పైన 92.5 అని ముద్ర వేసేసి ఉంది, బంగారు మీద 22k ani ela వేస్తారో ఆలా, కానీ లలితా లో అవేమీ ఉండవు, గుడ్డిగా చాలా వరకు కొనేస్తారు, ఎవరో కొందరు చెక్ చేస్తారు అపుడు నిజం తెలుస్తుంది లెక్కలు వేసుకుంటే.

ఫినిషింగ్- వస్తువు తయారీ గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ మెషీన్ తో చెయ్యటం వచ్చాక తయారీలో రాలిన బంగారు పొడి మళ్లీ తిరిగి వాడుకునే వెసులు కలిగింది, అదేమీ ఒకప్పటిలా నెల మీద పడిపోయి మట్టి లో కలిసిపోయి వృధా అయ్యే పరిస్థితులు లేవు ఇపుడు, కాబట్టి టెక్నికల్ గా వాళ్ళకి తరుగు ఏమి తగ్గదు, కానీ ఫినిషింగ్ కోసం రబ్బింగ్/బఫింగ్ చేసేటప్పుడు పలుచగా ఆ ఫినిషింగ్ కంపౌంట్స్ ఆర్ మెషీన్ ప్యాడ్స్ కి అంటుకుంటుంది అది మనం తిరిగి తియ్యలేనిది. లలితా లో పెద్ద ఫినిషింగ్ ఎం ఉండటం లేదు, చాలా వరకు గరుకు గా సరిగా పోలిష్ చెయ్యనట్టే అనిపించాయి కాబట్టి వాళ్ళకి అక్కడ శ్రమ/ఖర్చు లేదు.

ప్రకటనలు – వేరే వాళ్ళు పెద్ద సెలబ్రిటీస్ తో భారీ ఖర్చుతో ప్రకటనలు నిర్వహిస్తారు, ఈయన మాత్రం ఆయనే చేస్తారు అది కూడా చాలా వరకు వారి షాపుల్లో, కాబట్టి ఖర్చు చాలా చాలా తక్కువ. అమ్మకాలు – లలితా షాపుల్లో చాలా వరకూ డిజైన్స్ ఎక్కువ, మరియు ఇవన్నీ తెలివిగా చేస్తున్నారు అనిపించింది, చిన్న చిన్న పట్టణాల్లో చుట్టూ ఉండే జనాల అభిరుచులకు తగ్గట్లు డిజైన్స్ ఉంటున్నాయి, పెద్ద కంపెనీ లో అలా లేవు, మా నాన్న కి ఒక పాత డిజైన్ ఉంగరమే కావాలి అని పట్టుబట్టారు, మా అమ్మ కూడా పాత రకం గాజులు దండలు కావాలి అనింది, అవి లలితా లో మాత్రమే దొరికాయి, వేరే అన్నీ షాపుల్లో కొంచెం మోడర్న్ డిజైన్స్ అనే చెప్పాలి, అది కూడా చాలా ఎక్కువ రకాలు మోడల్స్ లలితా లో ఉంటున్నాయి.

ఇక అసలు ప్రశ్న – లలితా ఆయన కొంచెం తక్కువకు ఇస్తాడు, కానీ దాని వెనక పైన చెప్పిన అన్నీ కారణాలు ఉన్నాయి, అవ్వన్నీ జనాలకు తెలిసేలా అర్దం అయ్యేలా అడ్వర్టైజ్ చెయ్యలేరు, చేస్తే అది సినిమా అంత అవుతుంది, పైగా ఇవన్నీ ఒకటి రెండు సార్లు కొంటే గమనిస్తే తెలిసే విషయాలే, అందుకే ఊరుకున్నారు అని నా అభిప్రాయం. డబ్బులు ఊరికే రావు – మనకే ఇది, నిజమే, దీనికి ఆయన చెప్పేది, తరుగు కూలీలు చూసి కొనండి అని, ఎన్ని గ్రాముల ఆభరణం కి ఎంత డబ్బులు అని చూస్కోండి, నగ బరువులో ప్రతి గ్రాముకు ఎంత రేటు పడిందో చూసి కొనండి అంటారు ఆయన, నేను మీరు కొన్న వస్తువుల్లో నికర బంగారు/వెండి ఎంత అనేది కూడా చూస్కోండి అని చెప్తా.

100గ్రాముల బంగారు ఆభరణం అని అంటే అది నిజం గా 916 లేకపోతే మీ నికర బంగారు 100 కంటే తక్కువ అనేది గమనించండి, ఆ వంద గ్రాముల్లో బంగారు కాక రాగి వెండి కి మీరు బంగారు రేటు పెడుతున్నారు చూస్కోండి అంటా నేను(ఇది ఆయన చెప్పడు, ఎం చెప్పాలో అది చెప్పి ఎం చెప్పకూడదు అది చెప్పకుండా దాచటమే మార్కెటింగ్), బంగారు నగలు కొంటే అందులో 1000 లో 916 వంతులు ఉందా అని చూస్కోండి, వెండి వస్తువు కొంటే 1000 లో 925 ఉందా అని చూస్కోండి, ఎలా వంతులకి మీరు కట్టే ధరకి లెక్క వేసుకోండి, డబ్బులు ఊరికే రావు, ఇదేదో నాకు ప్రమోషన్ కాదు, అందరి ఇళ్ళల్లో బంగారు వెండి కొంటారుగా, తెలియాలి కదా ఇవన్నీ.

Admin

Recent Posts